వంద శాతం మిల్లింగ్ పూర్తి చేయాలి

- జేసీ సురేందర్ రావు మంచిర్యాల అగ్రికల్చర్ : 2018-19 రబీ సీజన్‌కు సంబంధించి వంద శాతం కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ కలెక్టర్, జేసీ వై సురేందర్ రావు సూ చించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీసీఎస్‌ఓ) వీ వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ గెడం గోపాల్‌తో కలిసి గురు వా రం జిల్లాలోని మిల్లర్లు, స్టేజ్ 1, 2 కాంట్రాక్టర్స్, ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జిలతో తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ సమయం దగ్గర పడుతుండడంతో మిల్లర్లు మిల్లింగ్ కోసం సిద్ధంగా ఉండాలన్నారు. మిల్లులు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద సైతం సీసీ టీవీ కెమెరాలు, పని చేస్తున్న హమాలీల వివరాలతోపాటు హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటాలన్నారు. అనంతరం స్టేజ్ 1, స్టేజ్ 2 కాంట్రాక్టర్లతో రేషన్ బియ్యం రవాణాపై చర్చించారు. రేషన్ బియ్యం తరలించే వాహనాలకు జీపీఎస్ లేకుంటే రేషన్ బియ్యం తరలించవద్దని సూచించారు. డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ గోవింద్, డీటీ విజయ, మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, ఎంఎల్‌ఎస్ పాయిం ట్ల ఇన్‌చార్జిలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Related Stories:

More