సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి

లక్షెట్టిపేట : సంపూర్ణ అక్షరాస్యతకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి పాణిని పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని స్ధానిక బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థ్ధులకు ఏర్పా టు చేసిన అమ్మ నాన్నకు చదువుఅనే అవగాహ న కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో పాటు వయోజనులందరికీ చదువు నేర్పించాలన్నారు. వయోజన విద్య జిల్లా సంచాలకులు అజ్మీరా పురుషోత్తం నాయక్ మా ట్లాడుతూ..అందరికీ విద్య-అందరిది బాధ్యత అనే నినాదంతో ప్రభు త్వం నిరక్షరాస్యతను రూపుమాపేందుకు కృషి చేస్తోందన్నారు. ఎంఈఓ కాసుల రవిందర్, హెచ్ ఎంలు రెడ్డిమల్ల ప్రకాశం, యశోద పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలి జన్నారం : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి పాణిని పేర్కొన్నారు. గురువారం కలమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్యర్యంలో నిర్వహించిన అండర్ 14,17 కుస్తీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మ న్ ముత్యం సతీశ్, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ మాదాడి సరోజన, సర్పంచ్ కార్తిక్‌రావు, ఎంపీటీసీ సభ్యురాలు స్వరూపరాణి, స్వదేశిరావ్, తాసిల్దార్ రాజ్‌కుమార్, ఎంఈఓ నడిమోట్ల విజయ్‌కుమార్, హెచ్‌ఎం ప్రభాకర్, ఎన్‌సీసీ అపీసర్ కట్ట రాజమౌళి, జాడి మురళి, డీ కమలాకర్, బీ రాంరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Stories:

More