భూసమస్యలు సత్వరమే పరిష్కరించాలి

దండేపల్లి : భూసమస్యలను సత్వరమే పరిష్కరించి రికార్డుల్లో పొందుపర్చాలని జేసీ సురేందర్‌రావు ఆదేశించారు. గురువారం తాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించా రు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న భూసమస్యలపై ఆరా తీశారు. పట్టాదార్ పాసుపుస్తకాలు రాని రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. బీఎల్‌వోలు మొబైల్ ఆప్ ఓటర్ వెరిఫై కార్యక్రమాన్ని విజయవం తం చేయాలన్నారు. దండేపల్లిలో జరిగి న భూసదస్సుకు హాజరయ్యారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించా రు. అనంతరం దండేపల్లి లో అటవీశాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఈయన వెంట తాసిల్దార్ కిరణ్మయి, ఎఫ్‌ఆర్‌ఓ దేవిదాస్, వీఆర్‌ఓలు ఉన్నారు.

Related Stories:

More