మాదాపూర్‌లో సాయికుమర్ అంత్యక్రియలు పూర్తి

మాదాపూర్: గోదావరి బోటుప్రమాదంలో మృతి చెందిన ఈరన్ సాయికుమర్ భౌతికకాయాన్ని ఉదయం 6గంటలకు మాదాపూర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు. నాలుగు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న సాయికుమార్ భౌతికకాయాన్ని చూసి కుటుం బసభ్యులు శోకసంద్రంలో మునిగారు. బంధువులు, స్థానికులు పెద్దఎత్తున ఇంటి వద్దకు చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సాయికుమార్ మృత్యు ఒడికిచేరడంతో పరామర్శించేందుకు వచ్చిన బంధువులు, స్థానికులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సాయికుమార్‌కు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తమ్ముడు సాయితేజ్ మాదాపూర్‌లోని టెన్ని స్ కోట్‌లో కోచ్ గా పని చేస్తున్నాడు. ఒక సోదరి వివాహం కాగా మరో సోదరి ఇంటి వద్దనే ఉంటున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. అనంతరం సాయికుకుమార్ మృతదేహానికి ఉదయం 9:30 గంటలకు అంత్యక్రియాలు నిర్వహించారు.

Related Stories:

More