నేడు పలు ప్రాంతాల్లో జలశక్తి అభియాన్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం భూగర్భ జల వనరుల పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా నిర్వహణలో రెండవ రోజు ఈ నెల 19న గురువారం ఉదయం 10 గంటల నుంచి ఖైరతాబాద్ మండలంలో నిర్వహిస్తున్నట్లు భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ మండలం చింతల్‌బస్తీలోని సీఎంఈ ఆవరణలో, తెలంగాణ సచివాలయం, మక్తా ఎస్టీపీ(హెచ్‌ఎండీఏ) ప్రాంతాల్లో నీటి మట్టం పరిశీలన, లేక్ వ్యూ గెస్ట్‌హౌజ్, రాజ్‌భవన్ రోడ్డు, మైనారిటీ కమిషన్, శ్రీనగర్‌కాలనీ ప్రాంతాల్లో బోర్‌వెల్ రీఛార్జ్, రూఫ్‌టాప్ రీఛార్జ్ స్ట్రక్చర్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Related Stories:

More