చలాన్లు కాదు.. హెల్మెట్లు..

-కేవలం చలాన్లు వేస్తారనే ముద్ర తొలగించేందుకు.. -ఇప్పటికే హెల్మెట్లు కొనిపిస్తున్న పోలీసులు -నేటి నుంచి జిల్లాలో ప్రారంభించనున్న ట్రాఫిక్ పోలీసులు మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎక్కడ పడితే అక్కడ చలాన్ల కోసం పోలీసులు రెడీగా ఉంటారు. ఇష్టం వచ్చినట్లు ఫైన్లు వేస్తున్నారు. ఇలా ప్రతి చోట ట్రాఫిక్ పోలీసులు కనిపించినప్పుడల్లా సామాన్యుడు అనుకుంటున్న మాటలు. వాహనదారులు, ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను రూపుమాపేందుకు పోలీసులు ఒక వినూత్న ప్రయోగం చేస్తున్నారు. హెల్మెట్ లేకుం డా వస్తున్న వాహనదారులకు అవి కొనేందుకు అవకాశం ఇస్తున్నారు. హెల్మెట్ కొనుక్కుని వస్తే చలాన్ వేయకుండా వదిలేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంటోం ది. కేవలం చలాన్లు వేయడం కాదు, అది మన రక్షణ కోసమే అనే విషయం ప్రజలకు అర్ధం అయ్యేలా చేయడం కోసం ఈ కార్యక్రమం ము ఖ్య ఉద్దేశం అని పోలీసులు చెబుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ పోలీసు లు ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని రకాలుగా ప్రజల కు ఉపయోగపడే పనులు చేస్తున్నారు. అయితే, కొద్ది రోజులుగా వాహనదారులకు హెల్మెట్ లేకుం డా, ఇతర పేపర్లు లేకున్నా చలాన్లు రాస్తున్నారు. పోలీసులు ఎక్కడ కనిపించినా తమకు చలాన్ల పే రుతో డబ్బులు గుంజుతున్నారు అనే భావన ప్రజ ల్లో స్థిరపడుతోంది. దీనిని రూపుమాపేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆలోచించి చేసిన ఓ వినూ త్న ప్రయత్నం ఇప్పుడు రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రయత్నానికి అటు వాహనదారులు, సామన్య ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుతున్న వారిని, ఇతర ఇన్సూరెన్స్, పొల్యూషన్, లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఒకే చోటికి చేర్చి వారికి జరిమానాలు విధించకుండా సంబంధిత పత్రాలు, హెల్మెట్‌కు అయ్యే ఖర్చును వారి చేతనే కట్టిపించి వారికి సంబంధిత పత్రాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. వినూత్న కార్యక్రమం ఇలా.. మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు నిలబడ్డారు. ఓ వాహనదారుడు హెల్మెట్ లేకుండా వస్తున్నాడు. వారు అతన్ని ఆపారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానా కట్టాలి. కానీ, మేం నీకు చలానా వె య్యం.. ఐఎస్‌ఐ ట్రేడ్ మార్కు ఉన్న హెల్మెట్ కొ నుక్కోమని సలహా ఇచ్చారు. అతను హెల్మెట్ కొ నుక్కుని వచ్చాడు. అతనికి చలాన్ వేయకుండా వాహనదారుడికి అవకాశం ఇవ్వడంతో అతను హెల్మెట్ ధరించాడు. ఇక మీదట అతనికి హెల్మెట్ ధరించడం అలవాటు అయిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారికి కూడా ఫైన్ వేయకుండా ట్రాఫిక్ పోలీసులు ఆన్‌లైన్ డ్రై వింగ్ లైసన్స్ స్లాట్ బుక్ చేసుకోమని చెబుతారు. ఇనూరెన్స్ ప్రతాలు లేకున్నా.. మరో వాహనదారుడికి లైసెన్స్ ఉంది... హెల్మె ట్ ఉంది.. కానీ, ఇన్సూరెన్స్ లేదు.. దీనికి వాస్తవానికి జరిమానా విధించాలి. కానీ, మేం జరిమానా వేయం... ఇన్సూరెన్స్ తీసుకోండంటూ వాహనదారుడికి ఇన్సూరెన్స్ ఏజెంట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇలా అతను ఇన్సూరెన్స్ తీసుకుని ఏడాది వరకు ఇన్సూరెన్స్ మీద చలాన్ లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. చలాన్లు వేస్తే కట్టి వెళ్తున్నారు తప్పించి తిరిగి మళ్లీ వాటి గురించి ఆలోచించడం లేదని పోలీసులు చెబుతున్నారు. హెల్మె ట్లు ధరించకపోవడం వల్ల వాహనదారులు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగులుతోందని వారంటున్నారు. అందుకే వారికి జరిమానా విధించకుండా ఆ డబ్బులతో హెల్మెట్ వారి చేత కొనిపిస్తే.. ఇక ముందు వారు హెల్మెట్ ధరించే అవకా శం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
More