నిర్లక్ష్యం వద్దు-భాగస్వామ్యమే ముద్దు

నెన్నెల: గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వద్దని భాగస్వామ్యమే ముద్దని కలెక్టర్ భారతి హోళికేరి అధికారులకు సూచించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నెన్నెల గ్రామాన్ని బుధవారం ఆమె సందర్శించారు. గ్రామంలో పారిశుధ్య పనుల్లో ప్రజలంతా తరలిరావాలని ఆమె సూచించారు. మన గ్రామాలను మనమే శుభ్రం చేసుకోవాలని ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామాల్లో ప్రజలందరి భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అధికారులతో కలిసి పని చేసినప్పుడే స్థానికంగా ఉన్న సమస్యలను తీర్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. గ్రామస్తులు అధికారులతో కలిసి రోడ్ల ను శుభ్రం చేసుకోవడం, చెత్త తొలగింపులో పా ల్గొనడం అభినందనీయమన్నారు. రోడ్లపై చెత్త వేసినా, ప్లాస్టిక్ వస్తువులను వేసినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద 30 రోజుల ప్రణాళికలో చేపట్టబోయే కార్యక్రమాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ఎంపీపీ రమాదేవి, జ డ్పీటీసీ సింగతి శ్యామల, సర్పంచ్ తోట సుజా త, ఎంపీటీసీ తిరుపతి, ఎంపీడీవో రాధాక్రిష్ణ, ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్, శ్రీధర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Stories:

More