అవయవ దానం చేయండి

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: అవయ వ దానం చేసి మరోసారి జీవించాలని ఉమ్మడి జి ల్లాల జీవీకే, ఈఎంఆర్‌ఐ ప్రోగ్రాం మేనేజర్ విజ య్ పిలుపునిచ్చారు. జీవీకే, ఈఎంఆర్‌ఐ 108, 102 సిబ్బందికి ప్రతినెలా జరిగే సాధారణ సమావేశం బుధవారం మంచిర్యాలలోని ఐబీ ప్రాంగణంలో కొనసాగింది. సిబ్బంది తమ అవయవాలను దానం చేస్తామని అంగీకార పత్రం ఇచ్చారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ మాట్లాడుతూ మరణం తరువాత మన దేహంలో ని అవయవాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఆలోచన గొప్పదన్నారు. దానాలన్నింటిలో కెల్లా అవయవదానం గొప్పదనీ, మరొకరికి ప్రాణదా నం చేసిన వారవుతారన్నారు. మనిషి చనిపోయా క తన శరీరంలోని 200 అవయవాలు, టిష్యూలు దానం చేయవచ్చునని, కళ్లు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద, చిన్న పేగులు, ఎముకలు, ఎముకలో ఉండే మూ లుగను కూడా దానం చేయవచ్చునని తెలిపారు. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత సగటున ఆరేడుగురికి బతుకును ఇవ్వవచ్చునని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవనదానం ప్రారంభించిందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్లీట్ కోఆర్డినేటర్ జనార్థన్, మంచిర్యాల జిల్లా ఇఎంపి పి వసంత్, ఇఎంటిలు వేణు, రాజశేఖర్, సతీష్, కిష్టయ్య, పైలెట్లు సంపత్, పూర్ణచందర్, అజిత్‌రెడ్డి, సాయికృష్ణ, శ్రీనివాస్, మహేందర్, నాగరాజు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Related Stories:

More