గ్రామాలు కొత్తగా కనిపించాలి

మంచిర్యాల రూరల్: గ్రామాల అభివృద్ధికి చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కార్యక్రమాలతో గ్రామాల్లో కొత్తదనం కనిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుం చి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్‌తో కలసి జిల్లా కలెక్టర్‌తో బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ప్రజలు స్వచ్ఛందం గా శ్రమదానం చేసేలా ప్రోత్సహిస్తూ వారంలో గా కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. స్వల్పమైన మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు నూ తన నర్సరీలను ఏర్పాటు చేసి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసి డంపింగ్ యార్డు, వైకుంఠదామం (శ్మశన వాటికలు) కోసం జిల్లాలో ఇప్పటి వరకు 120 గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించినట్లు చెప్పారు. గ్రామాల్లో పను లను ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నామన్నారు. వా ర్డుల్లో పర్యటిస్తూ పిచ్చి మొక్కలు, చెత్తా చెదా రం, రోడ్డుకు అడ్డంగా ఉన్న రాళ్లను తొలగించడంతో పాటు చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు బుట్టలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, స్థాయీ సంఘాలు గ్రామాల్లో చేప ట్టే పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు స్పష్టం చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగిస్తూ శిథిల వ్యర్థాలతో ఉపయోగంలో లేని బావులను పూడ్చి వేయడం, రోడ్లపై గుంతల్లో వేయడం చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇనుప విద్యుత్ స్తంభా లు, వంగిన, విద్యుత్ తీగలను తక్షణమే సరి చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో యువతీ, యువకుల జాబితా రూపొందించి అన్నింట్లో భాగస్వా ములను చేస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కాకరాల నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, అధికారులు పాల్గొన్నారు.

Related Stories:

More