ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి

చెన్నూర్ రూరల్: ఉపాధిహామీ కులీల సంఖ్య పెంచాలని నేషనల్ లెవల్ మానిటర్ మహాపాత్ర త్రిపాఠి సూచించారు. కాచన్‌పల్లిలో ఉపాధిహామీ పనులను బుధవారం నేషనల్ లెవల్ మానిరటర్లు గ్రామాన్ని సందర్శించి పనులపూపై ఆరా తీశారు. ఉపాధిహామి పనులు ఏవిధంగా జరుగుతున్నా యి. గ్రామాల్లోని కూలీలకు పనులను కల్పిస్తున్నా రా, సకాలంలో కూలీలకు డబ్బులు అందుతున్నా యా లేదా పింఛన్ అందుతుందా, తదితర అంశాలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని అర్హులంతా ఉపాధిహామీ పనికి వచ్చేలా చూడాలని తెలిపారు. ఈ పథకంలో రైతులకు కలిగే ప్రయోజనాలను గ్రామ సభల ద్వారా వివరించాలని చె న్నూర్ ఏపీవో గంగా భవానీకి సూచించారు. పని సమయాల్లో తీసుకోవలిసిన జాగ్రత్తలను వివరించారు. హరితహారంలో పొలాల గట్లపై నాటిన మొక్కలను రైతులు సంరక్షించాలని తెలిపారు. అనంతరం గ్రామంలోని మామిడితోటలను పరిశీలించారు. రైతులు మామిడి తోటలలో అంతర పంటలు వేయాలని సూచించారు. అనంతరం రిజిస్ట్రర్లను పరిశీలించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సదానంద్, బ్రహ్మయ్య ఉన్నారు.

Related Stories:

More