పథకాలను వినియోగించుకోవాలి

హుజూరాబాద్‌టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాశవాణి వరంగల్ విలేకరి పీవీ మదన్‌మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం పురపాలక పరిధిలోని కేసీ క్యాంప్‌లోని ఎంజేపీటీ బాలికల పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశా ఖ ఆధ్వర్యంలో ఫీల్డ్ పబ్లిసిటీ విభాగం వరంగల్-కరీంనగర్ వారు నిర్వహించిన పథకాల అమలుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్‌ను ఒక ఉద్యమంలా చేపట్టారన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనపథకం ద్వారా మొదటి దవలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు, రెండో దశలో తెల్ల కార్డులు కలిగిన మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారని వివరించారు. గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న అలజడి వల్ల రానున్న కాలంలో వంట గ్యాస్ సరఫరాలో కొంత ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయని, దీనిని అధిగమించేందుకు ఒకే సిలిండర్ ఉన్న వారు రెండో సిలిండర్ పొందాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ నాగభూషణం మాట్లాడుతూఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పథకాలపై అవగాహన కలుగుతుంద న్నారు. ఐ అండ్ బీ మంత్రిత్వశాఖ ఫీల్డ్ పబ్లిసిటీ వరంగల్-కరీంనగర్ క్షేత్ర అధికారి అర్థ శ్రీనివాస్ తమశాఖ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలలో ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పలు పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. సీడీపీవో శారధ, యునిసెఫ్ కోమల, ఎస్బీఎం సమన్వయకర్త రమేశ్, మెప్మా బాధ్యుడు వినయ్‌కుమార్ ఉన్నారు.

Related Stories:

More