స్వచ్ఛందంగా.. ఉత్సాహంగా..

-పల్లెల ప్రగతికి చేయీచేయి కలుపుతున్న గ్రామస్తులు -అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానాలు -ఊరూరా పారిశుధ్య పనులు -వాడవాడనా అవగాహన ర్యాలీలు -కొనసాగుతున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక పల్లెల్లో ఎక్కడ చూసినా ఒకటే ఉత్సాహం కనిపిస్తున్నది.. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా తమ గ్రామాలను నందనవనంలా తీర్చిదిద్దుకునేందుకు ప్రజానీకం చేయీచేయి కలుపుతున్నది.. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛందంగా పాల్గొంటున్నది.. సోమవారం ర్యాలీలు తీస్తూ, ఇంటింటికీ వెళ్లి పారిశుధ్యం, పచ్చదనంపై చైతన్య పరుస్తూ ముందుకుసాగింది.. శ్రమదానాలు, పారిశుధ్య పనులు చేపట్టి చెత్తను తొలగించింది.. (కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా అమలవుతున్నది. గ్రామసభలు, శ్రమదానాలు, పారిశుధ్య పనులతో పల్లెలు స్వచ్ఛతవైపు అడుగులు వేస్తున్నాయి. సోమవారం చాలా చోట్ల శ్రమదాన కార్యక్రమాలు చేపట్టారు. చొప్పదండి మండలం కొలిమికుంటలో జడ్పీటీసీ సభ్యురాలు మాచర్ల సౌజన్య, ఎంపీపీ చిలుక రవిందర్ గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. స్థానికంగా నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఇంటింటికీ ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని కోరారు. రుక్మాపూర్ పాఠశాలలో చెత్తా చెదారాన్ని తొలగించగా కొలిమికుంటలో రోడ్లును పరిశుభ్రంగా మార్చారు. గంగాధర మండలం మధురానగర్, గర్షకుర్తి, కొండన్నపల్లి, మల్లాపూర్, ముప్పిడి నర్సయ్యపల్లిలో శ్రమదానాలు నిర్వహించారు. పలు గ్రామాల్లో చెత్తతో కంపోస్టు ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు. రామడుగు మండలం తిర్మలాపూర్‌లో ప్రత్యేకాధికారి పవన్‌కుమార్ మొక్కలు నాటారు. గోపాల్‌రావుపేటలో రెండు రోజులుగా సేకరించిన చెత్తాచెదారాన్ని ట్రై సైకిళ్ల ద్వారా గ్రామానికి దూరంగా తరలించారు. వీణవంక మండలం రెడ్డిపల్లిలో ఎంపీపీ రేణుక, సర్పంచు నర్సయ్య ఆధ్వర్యంలో చెరువు కట్టకు వెళ్లే రోడ్డును మరమ్మతు చేశారు. జమ్మికుంట మండలం నగురంలో వైస్ ఎంపీపీ పొల్సాని తిర్మల్‌రావు, ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మించారు. ఇల్లందకుంట మండలం వాగొడ్డు రామయ్యపల్లిలో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించారు. హుజూరాబాద్ మండలం చెల్పూరులో శ్రమదానం చేసి, 30 రోజుల ప్రణాళిక ఉద్దేశాలు, లక్ష్యాల గురించి వివరిస్తూ గోడలపై రాతలు రాశారు. గన్నేరువరం మండలం జంగపల్లి, చీమలకుంటపల్లిలో స్థానికులు శ్రమదానం చేశారు. కొండాపూర్‌లో మొక్కలు నాటారు. పారువెల్లలో పాఠశాలలో శ్రమదానం చేసి గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించారు. చాకలివానిపల్లెలో ప్లాస్టిక్ కలెక్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. మానకొండూర్ మండలం కెల్లెడ, ముంజంపల్లి, వేగురుపల్లి, పెద్దూరుపల్లి, మద్దికుంట, వెల్ది గ్రామాల్లో శ్రమదానాలు చేశారు. పారిశుధ్య పనులు చేపట్టారు. శంకరపట్నం మండలం కొత్తగట్టు, పాత గోడలు కూల్చివేశారు. పారిశుధ్యం పనులు నిర్వహించారు. దోమల నివారణ చర్యలు తీసుకున్నారు. డెంగీపై అవగాహన కల్పించారు. కేశవపట్నంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా శ్రమదానం చేసి చెత్తా చెదారాన్ని తొలగించారు. ఆముదాలపల్లి, గద్దపాలక, కరీంపేట, మెట్‌పల్లి గ్రామాల్లో చెత్తా చెదారం తొలగించారు. మురికి కాలువల్లో పూడిక తీశారు.తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, నర్సింగాపూర్, పోలంపల్లి, గొల్లపల్లి, నల్లగొండ, మక్తపల్లి, రామకృష్ణకాలనీ గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టారు. ఇందిరానగర్‌లో ప్లాస్టిక్ కలెక్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రేణికుంటలో మురుగుకాలువల్లో పూడిక తొలగించారు. చిగురుమామిడి మండలం ముదిమానిక్యంలో పచ్చదనం- పరిశుభ్రతపై స్థానిక ప్రజలు అవగాహన ర్యాలీ తీశారు. ఎంపీపీ కొత్త వినీతతో కలిసి మొక్కలు నాటారు. ఇందుర్తి, రేకొండ, నవాబుపేట గ్రామాల్లో వీధుల్లో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించేందుకు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. రామంచ, బొమ్మనపల్లి, చిగురుమామిడి, ముల్కనూర్, గాగిరెడ్డిపల్లి, సుందరగిరిలో పారిశుధ్యం పనులు నిర్వహించారు.సైదాపూర్ మండలం ఎల్లంపల్లిలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక అధికారి రవిందర్ రెడ్డి మొక్కలు నాటారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీడీఓ పవన్‌కుమార్‌తో కలిసి గ్రామస్తులు శ్రమదానం చేశారు. గ్రామంలోని వీధుల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని ఎత్తి గ్రామం వెలుపల వేశారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి, కమాన్‌పూర్‌లో ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి బ్లేడ్ ట్రాక్టర్లతో వీధుల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. ఎలగందులలో గుర్తించిన రెండు పాడుబడిన బావుల్లో ఒకదానిని పూడ్చివేశారు. స్వచ్ఛత దిశగా బూరుగుపల్లి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక స్ఫూర్తితో ప్రతిరోజూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది గంగాధర మండలంలోని బూరుగుపల్లి గ్రామం. గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమదానాల్లో పాల్గొంటుండగా, గ్రామాభివృద్ధికి తాముసైతం అంటూ గ్రామస్తులు కలిసివస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైన అనతికాలంలోనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. - గంగాధర ఈ నెల 6న 30 రోజుల పల్లె ప్రత్యేక ప్రణాళిక మొదలు కాగా, మొదటి రోజు బూరుగుపల్లిలో గ్రామసభ నిర్వహించి సమస్యలను గుర్తించారు. రెండో రోజు కోఆప్షన్ సభ్యులతో పాటు స్థాయీ సంఘాలను ఎన్నుకోవడంతోపాటు ప్రతి కమిటీ సభ్యులు ప్రణాళిక ప్రతిజ్ఞ చేశారు. మూడో రోజు నుంచి ఆరో రోజు వరకు ప్రత్యేకాధికారి, సర్పంచ్, పాలకవర్గం, కోఆప్షన్ సభ్యులు విస్తృతంతగా పర్యటించి గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించారు. ఆ తర్వాతి రోజు నుంచి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు వివరాలను నమోదు చేసుకున్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో ఇటింటికీ పంపిణీ చేసిన మొక్కలు నాటారా? లేదా? పరిశీలించారు. గ్రామంలో చెత్తకుప్పలు, ముల్లపొదలు ఎక్కడడెక్కడున్నాయో? గుర్తించి తొలగించారు. రక్షిత మంచినీరు సక్రమంగా అవుతున్నది? లేనిది? గమనించారు. శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం, గ్రామంలో రెండు చోట్ల వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య, మార్కండేయ దేవాలయం సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ కంచె లేకపోవడం, నందగిరి రోడ్డులో డ్రైనేజీ సమస్య, గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, గ్రామస్తులు రోడ్లపై చెత్త వేయడం, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా గ్రామస్తులు ఉపయోగించడం వంటివి గుర్తించారు. ఒక్కొక్కటిగా పరిష్కారం.. గ్రామంలో గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే విధంగా గ్రామసభ ద్వారా అధికారులు, పాలకవర్గ సభ్యులు పలు తీర్మానాలు చేశారు. ఈ మేరకు రోడ్లపై పడేసిన చెత్తను తొలగించారు. తడి, పొడి చెత్త సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్లాస్టిక్ వస్తులు రోడ్లపై పడేకుండా 500ల జరిమానా విధిస్తుండడంతోపాటు ప్లాస్టిక్ వేస్టేజ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మించుకునేలా నీటి వృథాను అరికట్టడానికి రీచార్జిపిట్ల ఏర్పాటు చేసుకునేలా గ్రామస్తులను ప్రోత్సహిస్తున్నారు. అవసరమున్న చోట వీధి దీపాలు ఏర్పాటు చేశారు. డ్రైనేజీ శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిగడ్డిని తొలగించారు. పక్కాగా అమలు చేస్తున్నాం సీఎం కేసీఆర్ ఆదేశం ప్రకారం గ్రామ పంచాయతీలో 30 రోజుల ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తున్నాం. గ్రామంలో చేపట్టాల్సిన పనుల గుర్తించి ప్రణాళిక రూపొందించాం. దాని ప్రకారం ముందుకు సాగుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం. పారిశుధ్యం విషయంలో ఇప్పటికే శ్రమదానం వంటి కార్యక్రమాలు చేపట్టాం. గ్రామస్తులకు అవగాహన కల్పించాం. గ్రామస్తుల సహకారంతో 30 రోజుల్లో గ్రామ స్వరూపాన్ని మార్చడానికి కృషి చేస్తున్నాం. - మనోహర్, ప్రత్యేకాధికారి, బూరుగుపల్లి

Related Stories:

More