పెండ్లి పేరుతో మహిళకు మోసం..

హైదరాబాద్ : పెండ్లి పేరుతో మహిళను మోసం చేసిన యువకుడికి న్యాయస్థానం ఏడేండ్ల జైలుతో పాటు జరిమానా విధించింది. సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు కథనం ప్రకారం.. బడీచౌడి ప్రాంతానికి చెందిన దుర్గేష్ నందిని (25)కి ఇద్దరు పిల్లలు. కాగా.. భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో తరుచుగా ఇంటికి వచ్చే కుటుంబ స్నేహితుడు సూరజ్ (25) ఆమెను వివాహం చేసుకుంటానని లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ఆమెను కాదని మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఆమె జూలై 7, 2014లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు నాలుగు సంవత్సరాల పాటు న్యాయస్థానంలో విచారణ జరుగగా బుధవారం నిందితుడికి ఏడేండ్ల జైలు, రూ. 5వేల ఫెనాల్టీ విధిస్తూ నాంపల్లి రెండవ ఏసీఎంఎం తీర్పునిచ్చింది.

Related Stories: