మల్లె తోటల్లో కొమ్మల కత్తిరింపు

jasmine మల్లెపూలు స్వచ్ఛతకు, సువాసనకు మారుపేరు. ఈ పూలకు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ మంచి ఆదరణ ఉన్నది. ఈ పూల సాగు చేసే రైతులకు సంవత్సరంలో చాలాకాలం ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ తోటల్లో చేయాల్సిన పనుల గురించి ఉద్యాన అధికారులు అందించిన వివరాలు..కొమ్మల కత్తిరింపు: మల్లెలో మంచి దిగుబడి కోసం ఏటా కొమ్మలను కత్తిరించాలి. ఆకులను దూసివేయాలి. దీనివల్ల కొత్త చిగుళ్లు వచ్చి వాటిపై మొగ్గలు వస్తాయి. అయితే సంప్రదాయంగా మల్లె తోటలను సాగుచేసే రైతులు గొర్రెల మంద కడుతారు. ఈ పద్ధతిలో గొర్రెలు ఆకులు తింటాయి. దీనివల్ల చిగుర్లు వస్తాయి. అట్లనే గొర్రెల ఎరువు వల్ల భూసారమూ పెరుగుతుంది. అయితే ఎక్కువ కాలం పూల దిగుబడి కోసం గుండు మల్లెలో కొమ్మ కత్తిరింపులను 3-4 దఫాలుగా/తడవలుగా చేయాలి. నవంబర్‌ చివరి వారం నుంచి జనవరి మొదటి వరకు కత్తింపులు చేస్తే మార్చి నుంచి జూలై వరకు పూలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మల్లె మొక్కలన్నీ ఒకేసారి పూతకు రావు. రైతులు ఎక్కువరోజులు మల్లెపూలను మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. మంచి లాభం పొందవచ్చు. కొమ్మలను 70-90 సెం.మీ. ఎత్తు వరకు కత్తిరించాలి. చీడపీడలు ఆశించిన కొమ్మలను తెంచివేయాలి. ఆకులను దూసివేయాలి. మల్లె కొమ్మలను దగ్గరగా కట్టి మొక్కల మధ్య దున్న 10 రోజుల తరువాత నిపుణుల సూచించిన సిఫార్సు మేరకు ఎరువులు వేయాలి. కొత్త చిగుర్లపై మొగ్గలు వచ్చే వరకు పలుచగా నీరు కట్టాలి.

రైతుబడికి ఆహ్వానం

రైతు పంట పొలాలే జీవితంగా వ్యవసాయంలో రేయింబవళ్లు పనిచేస్తాడు. తమవైన అనుభవాలు, గుణపాఠాలతో మెరుగైన, మేలైన పంట విధానాల కు జీవం పోస్తాడు. ఇలాంటి అనుభవాలు పదిమందితో పంచుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది. కాబట్టి రైతులు తమవైన అనుభవాలు, గుణపాఠాలతో పాటు, తమ సృజనాత్మక పనిలో భాగంగా కొత్తగా ఆవిష్కరించిన పనిముట్ల గురించి రైతుబడికి రాసి పంపించగలరు.

రచనలు

-పంపవలసిన చిరునామా: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్‌.10, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034. raithubadi@ntdaily.news, Fax-040-23291118 https://www.ntnews.com/updates/latestnews/2020/jan/09/image.jpg