పెరటి తోటల పెంపకం

Rythubadi ఈ మధ్యకాలంలో మనం తినే కూరగాయల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఉల్లి ధర వంద రూపాయలకు పైగానే ఉన్నది. టమాటా వంకాయ, మిర్చి వంటి కాయగూరల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. అంతేకాక కూరగాయల్లో వివిధరకాల చీడపీడలు, తెగుళ్లను నివారించడానికి వివిధ రకాల రసాయనాలు అధిక మోతాదులో పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల వాటి రసాయన ప్రభావాలు కూరగాయల మీద ఉంటాయి. మన ఆరోగ్యం మీద వాటి ప్రభావం ఉంటుంది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడం, కూరగాయలు కొనడానికి అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం, మనఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరటి తోటల పెంపకమే మార్గం. పట్టణాల్లో నివసించే వారికి గ్రామాల్లో వలె అంతగా ఖాళీ స్థలం ఉండదు. అయితే ఉన్న స్థలంలోనే పెరటి తోటల పెంపకాన్ని చేపట్టవచ్చు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, రసాయనాల ప్రభావంలేని కూరగాయలను పొందవచ్చు. అంతేగాక ప్రాథమిక, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీస్థలాల్లోనూ పెరటి తోటల పెంపకానికి ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తున్నది. కూరగాయల పెంపకం పై బడి పిల్లలకు అవగాహన కల్పించడంతోపాటు బడి పిల్ల లు మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే కూరగాయలను పండించవచ్చు.

తోటల విస్తీర్ణం, సాగు చేసే కాయగూరలు

పెద్ద పరిమాణం విస్తీర్ణంగల పెరటి తోటలు కనీసం 500 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. ఈ తోటల్లో కొన్నిరకాల కూరగాయలతో పాటు కొన్నిరకాల అలంకార మొక్కలు, పండ్ల మొక్కలను పెంచవచ్చు. మధ్యస్థ పరిమాణం గల పెర టి తోటలు 100 నుంచి 200 చదరపు మీటర్లు పరిమాణం కలిగి ఉండాలి. ఈ తోటల్లో బెండ, గోరుచిక్కుడు, టమా టా, మిర్చి వంటి కూరగాయలను, నిమ్మ, మామిడి లాంటి పండ్ల మొక్కలు పెంచవచ్చు. ఇక చిన్న పరిమాణం గల పెర టి తోటలు 50 నుంచి 100 చదరపుమీటర్లు విస్తీర్ణం కలిగి ఉండాలి. ఈ పరిమాణం గల పెరటి తోటల్లో రెండురకాల కూరగాయలతో పాటు కొత్తిమీర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను పెంచవచ్చు. Rythubadi1

తోటల పెంపకంలో జాగ్రత్తలు

తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పెరటి తోటల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా నేలను శుభ్రపరుచాలి. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్‌ వేసి నేలను చదును చేయా లి. తర్వాత పాదులు చేసుకొని మొక్కలను, విత్తనాలను సరైన దూరంలో విత్తుకోవాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. చల్లని వాతావరణం ఉంటే ఐదారు రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. వేడి వాతావరణం ఉంటే రెండు మూడురోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వా లి. ఎప్పటికప్పుడు కలుపు సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలకు బాగా ఎండ, సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. తోటలకు నీటి వసతి దగ్గర ఉండే విధంగా చూసుకోవాలి.

అనువైన కూరగాయ పంటలు

చలికాలంలో ఆలుగడ్డ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, ఉల్లిగడ్డ, వెల్లు ల్లి, కొత్తిమీర, మెంతి వంటివి అనుకూలం.

నారు పోయడం

విత్తన పరిమాణం చిన్న సైజులో ఉండే టమాటా, మిర్చి, ఉల్లి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటి వాటిని పోట్రేలో నారు పోసుకోవాలి. 25 నుంచి 30 రోజుల వయసు ఉన్న నారు ను పెరటి తోటల్లో నాటుకోవాలి. విత్తన పరిమాణం పెద్ద సైజులో ఉండే బెండ, గోరుచిక్కుడు, బీర, సొర, కాకర వంటి తీగజాతి విత్తనాలను నేరుగా పెరటి తోటల్లో విత్తుకోవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనాలు విత్తేటప్పుడు సరైన దూరం పాటించాలి. టమాటా మొక్కలు నాటిన వెంటనే కర్రలతో లేదా స్టేకింగ్‌తో ఊతం ఏర్పాటు చేయాలి. జాతి కూరగాయలైన కాకర, బీర, సొర వంటి వాటికి పంది ర్లు గాని పాదులు గాని వేసి వాటి మీద పాకించాలి. పెరటి తోటల్లో ఎత్తయిన మొక్కలను ఉత్తరంవైపు పెంచాలి. దీనివ ల్ల నీడ ఇతర మొక్కలపై పడదు. గాలి తూర్పు నుంచి పడమరకు వీస్తుంది. దీనివల్ల మొక్కలకు సూర్యరష్మికి అడ్డులేకుండా ఉంటుంది. అట్లనే తోటల్లో ఎప్పటికప్పుడు వివిధరకాల పంటలతో పంట మార్పిడి చేయాలి. మొక్కల పెరుగుదలకు వీలైనంతవరకు సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. తోటల్లో సాగుచేసే మొక్కల్లో చీడపీడలు, తెగుళ్లు కనిపిస్తే లీటరు నీటికి నాలుగు మిల్లీలీటర్ల వేపనూనెచ రెండు మిల్లీలీటర్ల టీ పాల్‌, సబ్బు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. పెరటి తోటల పెంపకంలో ఎట్టి పరిస్థితిలోనూవిషపూరితమైన రసాయన మందులు వాడరాదు. తోటల పెంపకంలో ఇటువంటి చిన్నచిన్న పద్ధతులు పాటించడం ద్వారా మంచి దిగుబడితో పాటు రసాయానాల ప్రభావం లేని నాణ్యమైన కూరగాయలను పొందవచ్చు. Rythubadi2