యాసంగి వరి సాగులో జాగ్రత్తలు

Grain రాష్ట్రంలో యాసంగిలో సాగు చేసే పంటలలో వరి ప్రధానమైనది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి కురిసిన అధికవర్షాల వల్ల అన్ని సాగు నీటి ప్రాజెక్టులలో జలకళ సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో యాసంగిలోనూ మరింత వరి సాగు పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో యాసంగిలో స్వల్పకాలిక దొడ్డు గింజ రకాలైన యం.టి.యు. 1010, తెల్లహంస, ఐ.ఆర్‌. 64, కూనారం సన్నాలు, బతుకమ్మ, జగిత్యాల రైస్‌-1, అలాగే సన్నగింజ రకాలైన తెలంగాణ సోనా, హెచ్‌.యం.టి. సోనా, ప్రైవేట్‌ కంపెనీకి చెందిన రకాలను డిసెంబర్‌ 15 వరకు నార్లు పోసుకొని రైతులు సాగు చేసుకోవచ్చు. యాసంగిలో రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గినప్పుడు, చలి తీవ్రత పెరిగి మంచు కురుస్తున్నప్పుడు నారు సరిగా ఎదగక ఎర్రబడి కొన్నిసార్లు చనిపోతుంది. వరి నార్లు సరిగా ఎదగకపోవటం వలన వరినాట్లు ఆలస్యమౌతుండటం ప్రధాన పొలంలో మొక్కలు త్వరగా వేసుకోకపోవటం పరిపాటి. వరి నార్లు మరీ ఆలస్యమైతే పంటకోతలు ఆలస్యమై ఏప్రిల్‌-మే మాసంలో వచ్చే నీటి ఎద్దడికి గురయ్యే అవకాశం ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో తరచుగా వచ్చే వడగండ్ల వానలకు పంటనష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. రైతులు మార్చి మాసాంతానికి పంట కోతకొచ్చేటట్లు చూసుకోవాలి. కాబట్టి రైతులు యాసంగి వరి నారుమడి పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు యాసంగిలో పండించిన విత్తనాలను యాసంగిలో సాగుచేయాలనుకున్నట్లయితే నిద్రావస్థ ఉన్న రకాలలో యాసిడ్‌ ట్రీట్‌మెంట్‌ తప్పనిసరిగా చేయాలి. సాధారణంగా తెలంగాణ సోనా, యం.టి.యు. 1010 రకాలను రెండు వారాలు, అలాగే కూనారం సన్నాలు, బతుకమ్మ రకాలకు మూడు వారాల నిద్రావస్థ ఉంది అని గమనించాలి. నిద్రావస్థ తొలిగించడానికి లీటరు నీటికి 6.5 మి.లీ. (రెండు వారాల నిద్రావస్థ) లేదా 10 మి.లీ. (3-4 వారా లు) గాఢ నత్రికామ్లం కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి కడిగి మండెకట్టాలి. విత్తనశుద్ధి: దమ్ము చేసిన నారుమడులకు లీటరు నీటికి 1గ్రా. కార్బండాజివ్‌ు కలిపిన ద్రావణంలో 24 గంటల నానబెట్టి తరువా త మండెకట్టి మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. Grain1 నారుమడి తయారీకి 1-2 వారాల ముందు 2 గుంటల నారుమడికి 2 క్వింటాళ్ల బాగా మాగిన గొర్రెల ఎరువు లేదా కోళ్ళ ఎరువు లేదా వర్మీకంపోస్టు వేసి పొలాన్ని బాగా కలియదున్నాలి. ఒక ఎకరానికి సరిపడా (2 గుంటలు) నారుమడి అడుగులో 1 కిలో నత్రజని, 2 కిలోల భాస్వరము, 1 కిలో పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి. నారు 15-20 రోజుల దశలో పైపాటుగా 1 కిలో నత్రజ ని (2 కిలోల యూరియా) వేసుకోవాలి. అలాగే వరి నాటడానికి వారం ముందు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలను 800 గ్రాముల చొప్పున 2 గుంటల నారుమడిలో వేయాలి. యాసంగిలో చలి సమస్యను అధిగమించడానికి నారుమళ్ళపైన ఇనుప చువ్వలు/వెదురు కర్రలతో ఊతం ఇచ్చి పైన పలుచని పాలిథీన్‌ షీట్‌ లేదా పాలిపూవెన్‌ యూరియా బస్తాలతో తయారుచేసిన పట్టాలను సాయంత్రంవేళల్లో కప్పి ఉంచి మరుసటిరోజు ఉదయా న్నే తీసివేయాలి. అలాగే రాత్రివేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలి. నారు ఆరోగ్యవంతంగా పెరుగడానికి పైపాటుగా 2 గుంటల నారుమడికి కిలో యూరియాకు 2.5 మి.లీ.మ్యాంకోజెబ్‌తో పాటు 2.5గ్రా. కార్బండాజివ్‌ు లేదా 19:19:19 లను 10 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగి నారుమళ్ళలో చలివల్ల వచ్చే జింక్‌ లోప సవరణకు లీట రు నీటికి 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసిన తర్వాత 15-20 రోజులకు సిఫారసు చేసిన ఎరువులను వేయాలి. నారుమడిలో ఊద, ఒడిపిలి వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే విత్తిన 15-20 సిఫారసు చేసిన రోజుల్లో సైహలోఫాప్‌-పి- బ్యుటైల్‌ 1.5 మి.లీ, వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే బిస్‌ పైరిబాక్‌ సోడియం 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి నారుమడిలో నీరు తీసివేసి పిచికారీ చేయాలి. ప్రస్తుతం నెలకొన్న చలి వాతావరణం వలన నారుమళ్ళలో కొన్నిప్రాంతాలలో అగ్గితెగులు ఆశించినట్లు గమనించడమైనది. నివారణకు ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రా. లేదా మ్యాంకోజెబ్‌ 2.5 మి.లీ. లతో కలిపి ట్రైసైక్లోజోల్‌ను లేదా ఐసోప్రోథయోలేన్‌ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. Grain2