సేంద్రియ పద్ధతిలో కాయగూరల సాగు

Vegetables రిటైర్డ్‌ అవ్వగానే కొందరు వాళ్లకు నచ్చిన పనిచేయడానికి చేయడానికి ఆసక్తి చూపెడుతారు. అలాంటి కోవకు చెందినవారే రిటైర్డ్‌ పోలీసు ఆఫీసర్‌ మాధవరెడ్డి. తన రిటైర్మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బులతో తుక్కుగూడ సమీపంలో 19 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ సిరులు పండిస్తున్నారు. పుదీనా నుంచి పుంటికూర వరకు కాకర నుంచి అడవి కాకర ఇలా వివిధ రకాల కాయగూరలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. వినియోగదారులకు తన వంతుగా తాజా కూరగాయలు అందిస్తున్నారు. వ్యసాయం దండగ అని సలహాలిచ్చిన మిత్రుల కుటుంబసభ్యులు ప్రస్తుతం తన నిర్ణయం సరైనదని, తన వద్దకు వచ్చి కూరగాయలు తీసుకువెళ్తుంటే నాకు చాలా ఆనందంగా ఉన్నదని తెలిపారు. స్వేచ్ఛగా తనకు నచ్చిన పంటలు పండిస్తున్నాను. Vegetables1 మాధవరెరెడ్డి 19 ఎకరాలో దాదాపు12 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాగుకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నది. విత్తనాలు, ఎరువులతో కొరత లేదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మూడు ఎకరాలకు పైగా పొలం ఉన్న రైతు కూడా రాజులా బతుకవచ్చుంటున్నారు. ఉద్యోగరీత్యా అనేక సౌకర్యాలు అనుభవించాను. కానీ విశాలమైన వాతావరణంలో ప్రశాంతంగా బతకడానికి సాగు భూమి దొరికింది. కష్టపడి పనిచేసే రెండు కుటుంబాల వారు నిరంతరం ఇక్క డే అందుబాటులో ఉండటం కలిసి వచ్చే అంశం అన్నారాయన. - తమ్మడి మాసయ్య, తుక్కుగూడ

మాకు ఉపాధి దొరుకుతున్నది

మాది ఆంధ్రా. కానీ 10 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా దృష్టి అంతా నిరంతరం సాగు పైనే. భూమిని నమ్మిన వారికి ఎప్పుడూ నష్టం ఉండదు. ప్రస్తుతం కాకర, అడవి కాకర, బీర, చిక్కుడు, వంకాయ, టమాటా, మిర్చి, దొండ, వారానికి రెండు మూడు పర్యాయాలు కోసి (తెంచి) మార్కెట్‌లో విక్రయిస్తున్నాం. సారు అందిస్తున్న ఉపాధి వల్ల మా బతుకు సజావుగా సాగుతున్నది. - సుజాత, మహిళారైతు

మంచి వనరులు ఉన్నాయి

ఇక్కడ చాలా వనరులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆలస్యంగానైనా మంచి వర్షాలు పడినాయి. దీనివల్ల నేలలో తేమ బాగా ఉన్నది. భూగర్భజలాలు పెరిగాయి. దీంతోబోరు బావుల నీటి శాతం మెరుగుగానే ఉన్నది.డ్రిప్‌ సహాయంతో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాం. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. - రాజేశ్‌ రైతు, తుక్కుగూడ

వెల కట్టలేనిది

మాది రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గోపులారం. వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే ఆసక్తి. ఉద్యోగరీత్యా సొంత గ్రామాన్ని విడిచి పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వచ్చింది. అయితే ఎక్కడ ఉన్నా క్వాటర్స్‌ ఆవరణలోనూ కొంత కూరగాయలు సాగు చేసుకునేవాళ్లం. ఇప్పుడు పూర్తి సమయమంతా సాగు మీదే ఉండే అవకాశం లభించింది. అప్పుడప్పుడు స్థానిక వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను కలిసి తగిన సాగు సూచనలు తీసుకుంటాం. తాము పండించి తాజా కూరగాయలు తీసుకునేటప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. అది వెల కట్టలేనిది. మార్కెట్‌లో త్వరగా పాకానికి రావడానికి వివిధ రసాయనాలు వాడుతున్నారు. దీనివల్ల ఆ పండుకు సాధారణంగాఉండే రుచి, విటమిన్లు ఆశించినస్థాయిలో లభించవు. కూరగాయలు మన నగరానికే ఇంకా అవసరం పడుతాయి. శంషాబాద్‌, నగరంలోని మాదన్నపేట మండీ, ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్‌లకు వారంలో రెండు మూడు రోజులు తీసుకెళ్తారు. ఇక్కడ జాతీయ రోడ్డు రవాణ, రైల్వే వంటి రవాణ వసతులు అందుబాటులో ఉన్నాయి. - మల్లెగాలి, మాధవరెడ్డి, రిటైర్డ్‌ పోలీసు ఆఫీసర్‌, తుక్కుగూడ