పట్టుపురుగుల పెంపకంలో ఊజీ ఈగల నియంత్రణ

పట్టుపురుగుల పెంపకంలో అవసరమైన సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించడం లేదు. దీనివల్ల పట్టు పురుగులకు పాలు కారు రోగం, సున్నపుకట్టు, ప్లాచరీ (సచ్చు రోగం), పెబ్రిన్ మొదలగు వ్యాధుల ద్వారానే కాకుండా ఊజీ ఈగ తాకిడి వల్ల కూడా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. దీంతో పంట నష్టం సుమారు 15-20 శాతం వరకు ఉంటుంది. ఊజీ తాకిడి వానకాలం, చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. ఊజీ ఈగ వల్ల ఏర్పడే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని దాని నియంత్రణ చర్యలు పాటించాలి. Eggs ఊజీ ఈగలు తన జీవిత చక్రంలోని లార్వాదశలను పట్టు పురుగులను ఆశించి అందులోని వివిధ కణజాలలను ఆహారంగా తీసుకుంటాయి. దాన్ని చొచ్చుకొని బయటకు వచ్చి కోశస్థ దశలుగా మారి మళ్లా పెద్ద పురుగులుగా మార్పు చెందుతాయి. ఇవి మొట్టమొదటగా మన దేశంలో 1980లో కర్ణాటక రాష్ట్రంలో కనబడినాయి. తర్వాత ఇతర రాష్ర్టాలకు వ్యాపించాయి. దీనివల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు.

జీవిత చక్రం

సంపర్కం తర్వాత ఈగ 300-1000 గుడ్ల వరకు 9-25 రోజుల కాలంలో పట్టు పురుగులపై (పెద్ద దశ ) ఒక్కో పురుగుపై 1-2 గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లను చాలావరకు పురుగు పైభాగంలో ఖండికాల మధ్య పెడుతుంది. ఈ గుడ్లు 2-5 రోజుల వ్యవధిలో పగిలి పట్టుపురుగుల శరీరంలోకి రంధ్రం చేసుకొనిపోతాయి. ఈవిధంగా నల్లని మచ్చలు పట్టుపురుగులపై ఏర్పడుతాయి. కాబట్టి ఊజీ తాకిడికి గురైన పురుగులను గుర్తించవచ్చు. ఈ విధంగా ఊజీ ఈగ పట్టు పురుగు కణజాలం పూర్తిగా తింటాయి. తద్వారా పట్టుపురుగు చనిపోతుంది.

నియంత్రణ, యాజమాన్య పద్ధతులు

ఊజీ ఈగ తాకిడి నియంత్రణ పద్ధతులను ఉపయోగించి సమగ్ర యాజమాన్యం ద్వారా నిర్మూలించవచ్చు.

నివారణ పద్ధతులు

-పెంపకపు గదిలోను, పరిసరంలోనూ చిన్న చిన్న రంధ్రాలను సిమెంట్‌తో పూడ్చాలి. -ఊజీ బారిన పడిన 5వ దశ పట్టుపురుగులు లేదా 2 రోజుల ముందుగానే గూళ్లు అల్లుతాయి. వీటిని ముందుగానే గుర్తించి వేడి నీటిలో వేసి చంపాలి. -పట్టు పురుగుల పెంపకం గదిలోనూ, పట్టు గూళ్ల విక్రయ కేంద్రంలోనూ, పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రాల్లోనూ కిందపడిన ఊజీ ఈగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. -ఊజీ తాకిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి సేకరించిన విత్తనపు గూళ్లను ఊజీ లేని ఇతర ప్రాంతాలకు తరలించరాదు.

నియంత్రణ పద్ధతులు

-పట్టు పురుగుల పెంపకం గదికి నైలాన్ వలను అన్నివైపులా అమర్చాలి. -మల్బరీ ఆకును పెంపకం గదిలోకి వెళ్లే దారిలో ముందు ఒక చిన్న గదిని నైలాన్ వలలో ఏర్పాటు చేయాలి. -మల్బరీ ఆకులను నేరుగా తోసుకురాకుండా, మొదట ఉండే గది లో ఈగలు లేని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకురావాలి. Eggs1

రసాయనాలను వినియోగించడం

ఊజీ నాశక ద్రావణాన్ని ఉపయోగించడం: 10 గ్రాముల ఆసిడ్‌ను 125 మి.లీ. అసిటోన్ ద్రావణంలో కరిగించి ఆ తర్వాత 875 మి.లీ. నీటిలో కలిపి మొత్తం 1 లీటరు పిచికారీ ద్రావణాన్ని గాలి చొరపబడని సీసాలలో మూతపెట్టి ఉంచాలి. ఇది ఊజీ ఈగ పట్టు పురుగులపై పెట్టిన గుడ్లలోని పిండాలను చంపుతుంది. పిచికారీ చేయాల్సిన ఊజీ ద్రావణ మోతాదు, విధానం: 1 చదరపు అడుగు పెంపకపు బెడ్ విస్తీర్ణము నందు 5-6 మి.లీ. పిచికారీ చేయ డం వల్ల ఊజీ ఈగ పట్టుపురుగుల పైన పెట్టిన గుడ్లను నాశనం చేయవచ్చు. పట్టు పురుగు 2వ జ్వరం నుంచి బయటకు వచ్చిన 24 గంట ల తర్వాత రోజు విడిచి రోజు పిచికారీ చేయాలి. పురుగుల జ్వరానికి పోయే దశలో గానీ, జ్వరములో ఉన్నప్పుడు గానీ, జ్వరం నుంచి వెలుపలికి వచ్చిన వెంటనే కానీ ఈ ద్రావణాన్ని పిచికారీ చేయవద్దు. పిచికారీ చేసిన అరగంట వరకు పురుగులకు ఆకు మేతగా వేయవద్దు. మొత్తం 5-6 సార్లు 2వ దశ తర్వాత పురుగులపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. -1వ సారి 2వ జ్వరం నుంచి బయటకు వచ్చిన 24 గంటల తర్వాత -2వసారి 2వ జ్వరం ముగిసిన పురుగులకు 20 గంటల తర్వాత -3వ సారి 3వ జ్వరం ముగిసిన పురుగులకు 72 గంటల తర్వాత -4వ సారి 4వ జ్వరం ముగిసిన పురుగులకు 24 గంటల తర్వాత -5వ సారి 4వ జ్వరం ముగిసిన పురుగులకు 72 గంటల తర్వాత -6వ సారి 4వ జ్వరం ముగిసిన పురుగులకు 120 గంటల తర్వాత

జీవ సంబంధిత కారణాల ద్వారా ఊజీ నివారణ

ఈ పరాన జీవులు ఊజీ కోశస్థ దశలలో మాత్రమే తన జీవిత చక్రాన్ని పూర్తిచేయడం ద్వారా వాటిని చంపుతుంది. ఈ జీవి ఈగలను ఆడ వాటిని 1 లక్షకు 5000 మగ జీవులను 3 దఫాలుగా (ప్రతి 100 గుడ్ల పట్టు పురుగుల పెంపకానికి) వదులాలి. పైన తెలిపిన విధంగా రైతులు నివారణ, యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఊజీ ఈగ బారి నుంచి రక్షించుకోవచ్చు. అధిక గూళ్లను ఉత్పత్తి చేయవచ్చు.