ఒకసారే పెట్టుబడి దీర్ఘకాలిక దిగుబడి

Dragon-Fruit డ్రాగన్‌ఫ్రూట్‌ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ పండులో వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులకు, అజీర్ణ సమస్యలకు ఈ పండు ఔషధంగా పనిచేస్తుంది. ఇన్నిరకాలుగా ఉపయోగపడుతున్నది. ఈ పంట రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. డ్రాగన్‌ ఫ్రూట్‌కు మార్కెట్‌లో మంచి డిమాండు ఉన్నది. దీంతో రైతులు ఈ సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ పంట సాగు చేస్తే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉన్నది. తైవాన్‌ దేశంలో పండే ఈ పంటకు మన దేశ నేలలు అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీంతో ఈ పంట వేశానని రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తనకున్న ఎకరం నరలో ఈ పంట సాగు చేస్తున్నారు. ఈ పంట సాగు కోసం చంద్రశేఖర్‌ రెడ్డి కలకత్తా నుంచి డ్రాగ న్‌ ఫ్రూట్‌ మొక్కలను తీసుకొచ్చారు. ఉద్యోగం నుంచి రిటైర్డ్‌ అయిన తర్వాత రైతులకు కొత్త పంటలు పరిచయం చేయడానికి అధ్యయనం చేసిన్నట్లు చెప్పారు. తనకున్న ఎకరంనర పొలంలో 16 వందల మొక్కలను నాటించారు. ఏడాదిన్నర లోపు పంట చేతికి వచ్చింది. మొదటి సంవత్సరమే మంచి లాభాలు రావడం ఆనందంగా ఉన్నదని సంతోషం వ్యక్తం చేశారు. ఎకరాకు నాలుగు టన్నుల డ్రాగన్‌ఫ్రూట్‌ దిగుబడి వచ్చిన్నట్లు తెలిపారు. ఈ పంట సాగులో ఎరువులుగా పశువుల పేడ మాత్రమే వాడుతున్నారు. ఈ పంట దాదాపు 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుందన్నారు. పంట వేసినప్ప టి నుంచి ఇప్పటివరకు పంటకు ఎలాంటి చీడపీడలు సోక లేదని చెప్పారు. ఈ పంట సాగు చేయడానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయిందని తెలిపారు. అయితే 30 సంవత్సరాల వరకు ఏటా పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంటవేసే మొదటిసారి మాత్రమే పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. అట్లనే ఈ పంట సాగు చేయడం సులభం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. జంతువులు ఏవీ కూడా ఈ పంటను తినే అవకాశం లేదు. చీడపీడల బెడద కూడా తక్కువే. రైతులకు అన్ని విధాలు లాభం చేకూర్చే పంట. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ పంట సాగు చేస్తున్నాని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపా రు. దీంతో పండు చాలా రుచి ఉంటుంది. ఈ పండుకు మార్కెట్‌లో కిలోకు రూ.200లు ఉన్నది. ఒకసారి పెట్టు బడి పెడితే ఏటా లాభాలే తప్ప నష్టాలు ఉండవన్నారు.

సాగు పద్ధతులు

ఈసాగు చేయడానికి ముందు భూమిని చదును చేసుకోవా లి. భూసార పరీక్షలు చేయించాలి. నేలలో ఉదజని 7 శాతం ఉంటే సరిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపా రని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మూడుసార్లు భూమిని దున్నాలి. తర్వాత 10ఫీట్ల దూరంలో సాలు తోలాలి. అడ్డం నాలుగు ఫీట్ల దూరంలో 7 ఫీట్ల ఎత్తు ఉన్న సిమెంట్‌ స్తంభాలను నాటుకోవాలి. సిమెంట్‌ స్తంభంపై భాగంలో రౌండుగా ఉండే ఒక సిమెంట్‌ బిల్లను అమర్చాలి. ఎకరానికి 500 సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలను నాటే ముందు పాదు దగ్గర పశువుల పేడ మాత్రమే వేశానని తెలిపారు. మొక్కలు కింద పడిపోకుండా టైరుతో సిమెంట్‌ కట్టారు. మొక్కలను నాటడానికి రెండు నుంచి మూడు ఫీట్ల లోతులో పాదు చేసుకోవాలి. ఒక్కో స్తంభానికి నాలుగు మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. లాంటి మందులు వాడవలసిన అవసరం లేదు. డ్రిప్‌ విధానం ద్వారా నీళ్లను అందిస్తున్నారు.

మార్కెట్‌లో మంచి డిమాండు

డ్రాగన్‌ ప్రూట్‌కు మార్కెట్‌లో మంచి డిమాండు ఉన్నది. ఆరోగ్యానికి ఈ పండు శ్రేయస్కరంగా ఉంటుంది. దీంతో చాలా మంది ఈ పండును తినడానికి ఇష్టపడుతున్నారు. రాష్ట్రంలో డ్రాగన్‌ ప్రూట్‌ దిగుబడి తక్కువగా ఉన్నది. దీంతో మార్కెట్‌లో ఈ పంటకు మంచి ధర ఉన్నదని తెలిపారు. Dragon-Fruit1

మంచి లాభాలు

రైతులకు మేలు చేసే పంట. సాగులో పెద్దగా పని ఉండదు. మందులు వేయాల్సిన పనిలేదు. నీటి అవసరం చాలా తక్కువే. సేంద్రియ పద్ధతిలో పంట పండిస్తున్నా. సులభ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. రైతులకు మంచి లాభాలు వస్తాయి. పంట వేసిన్నప్పుడు మాత్రమే ఎకరాకు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఖర్చు ఉండదు. - పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌, రైతు బిరుదు చందర్‌, బడంగ్‌పేట 8096565106