అల్లం సాగులో సమగ్ర సస్యరక్షణ

Ginger-Cultivation అల్లం వాణిజ్యపరంగా సాగుచేయబడుతున్న సుగంధ ద్రవ్యపు పంట. ఈ పంట ఔషధంగా కూడా ప్రసిద్ధి చెందింది. అల్లాన్ని వంటల్లో విరివిగా వాడుతారు. అల్లం పంట రాష్ట్రంలో దాదాపు 1771 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. ఈ పంటను ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో విస్తారం గా సాగుచేస్తున్నారు. అయితే ఇటీవల అల్లం పంటకు వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనవి దుంపకుళ్లు ఈగ, మొవ్వు తొలుచు పురు గు, ఆకుముడత పురుగు, పొలుసు పురుగు, వేరు పురుగు మొదలైనవి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. అప్పుడు రైతులు మంచి దిగుబడులు పొందవచ్చు.

సస్యరక్షణ చర్యలు

దుంపకుళ్లు ఈగ: ఈ పురుగు అక్టోబర్‌ నెలలో మొదలై కాపు ఉన్నంత వరకు ఉంటుంది. దుంపకుళ్లు ఈగ నలుపు రంగులో ఉండి తెల్లని గుడ్లను మొక్క మొద లు వద్ద గాని, నేల మీద గాని, రంధ్రాలు ఏర్పడిన నేల మీద గాని పెడుతుంది. గుడ్ల నుంచి పొదిగిన లార్వా తెలుపు రంగులో ఉంటుంది. కాండాన్ని, దుంపల్ని ఆశించి కాండాల్ని పూర్తిగా తొలిచి తింటుంది. దీనివల్ల ఆకులు పసుపు పచ్చరంగులోకి మారి, కాండాలు పడిపోతాయి. ఈ పురు గు వల్ల 40-50 శాతం నష్టం వస్తుంది. నివారణ: దీని నివారణకు మొదటగా వేడి వాతావరణంలో లోతు గా దుక్కులు దున్నాలి. దుంపకుళ్లును తట్టుకునే, పీచు తక్కువగా ఉండే అల్లం రకాలను సాగు చేయాలి. మురుగు నీటి కాలువలు ఏర్పాటు చేసి, నీళ్లు నిల్వకుండా చేయాలి. ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలను సన్నని ఇసుకతో కలిపి తోటంతా సమంగా వేసుకోవాలి. ఆకు ముడత పురుగు: ఆకు ముడత పురుగు నలుపు రంగులో ఉంటుంది. దాని రెండు జతల రెక్కల మీద తెల్లని చారలు ఉంటా యి. ఈ పురుగు గుడ్లలను ఆకు పైభాగంలో పెడుతుంది. గుడ్లు ఎరుపు రంగులో ఉంటాయి. గుడ్ల నుంచి పొదిగిన లార్వా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. లార్వా ఆకులను చుట్టి తింటుంది. దీంతో మొత్తం ఆకు వాడిపోతుంది. నివారణ: దీని నివారణకు ప్రొఫెనోఫాస్‌ 1 మి.లీ/ లీటరు చొప్పు న శాండివిట్‌తో కలిపి 200 మి.లీ. ఎకరానికి మందు ద్రావణాన్ని తయారుచేసుకొని ఆకులపై పిచికారీ చేయాలి. అలాగే లార్వాలను ఏరి నాశనం చేయాలి. Ginger-Cultivation1 మొవ్వు తొలుచు పురుగు: ఈ పురుగు చూడటానికి పసుపుపచ్చ రంగులో ఉంటుంది. చిన్నచిన్న నల్లని మచ్చలను రెండు జతల రెక్కల మీద కలిగి ఉంటుంది. ఇది గుడ్లను ఆకుల మీద గుంపులు గుంపులుగా పెడుతుంది. గుడ్ల నుంచి లార్వా మొవ్వను తొలచడం వల్ల కొమ్మ లోపలి భాగం పసుపు రంగులోకి మారిపోయి చనిపోతుంది. ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా జూలై నుంచి అక్టోబర్‌ వరకు కనిపిస్తుంది. నివారణ: దీని నివారణకు మొదట పురుగు ఆశించిన మొవ్వులను ఏరి నాశనం చేయాలి. అలాగే డైమిథోయేట్‌ 2 మి.లీ+శాండివిట్‌ 1 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. శాండివిట్‌ లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ+ శాండివిట్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని మొవ్వు ఆకులపై పిచికారీ చేయాలి. పొలుసు పురుగు: విత్తిన దుంపలను ఆశించి రసం పీలుస్తుంది. అందువల్ల దుంపలు కుంచించిపోతాయి. నివారణ: దీని నివారణకు విత్తిన దుంపలను లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున మలాథియాన్‌ కలిపి ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత ఆరబెట్టి విత్తుకోవాలి. వేరు పురుగు: వేరు పురుగు గుడ్లను కాండం మీద పెడుతుంది. దీంట్లోనుంచి పొదిగిన పిల్ల పురుగులు ‘సీ’ ఆకారంలో తెల్లగా ఉండి దుంపలను, వేర్లను, మొక్కల మొదళ్లను ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు ఆశించిన దుంపల మీద పెద్ద పెద్ద రంధ్రాలు చేసి నష్టం చేస్తాయి. నివారణ: దీని నివారణకు ఫోరెట్‌ 5 కిలోలు లేదా కార్బోఫ్యూరాన్‌ గుళికలు 7 కిలోలు/ ఎకరానికి వేసి తీవ్రతను తగ్గించుకోవచ్చు. Ginger-Cultivation2