ఔషధ వేదం

book (వ్యవసాయం, ఆరోగ్యంలో ఔషధ మొక్కలు) వ్యవసాయక సమాజాల్లో ఆరోగ్యం కోసం మెజారిటీ ప్రజలు ఔషధ మొక్కలపైనే ఆధారపడుతారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది తమ ప్రాథమిక ఆరోగ్య అవసరాల కోసం ఔషధ మొక్కలపైనే ఆధారపడుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యంలో ఔషధ మొక్కల ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. ఈ అవసరాన్ని గుర్తించిన ‘రైతునేస్తం’ వారు దేశంలో ప్రజలకు అందుబాటులో ఉండే మొక్కల నుంచే ఆరోగ్య సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో తెలియ చేయటం ముదావహం. ప్రజలకు సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకే కాకుం డా, వ్యవసాయ సంబంధ అవసరాలకు ఉపయోగపడే మొక్కలు తమ పరిసరాల్లోనే అందుబాటులో ఉండేవి ఎలా ఉపయోగపడుతాయో వివరిస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో, అందరూ గుర్తించేందుకు వీలుగా మంచి ఫొటోతో సహా ప్రచురించి అందుబాటులోకి తేవటం హర్షణీయం. ఈ పుస్తకం అందరికీ ఉపయుక్తం. రచన: ప్రొఫెసర్‌ కోసరాజు చంద్రశేఖరరావు వెల: రూ. 350 ప్రతులకు: రైతునేస్తం పబ్లికేషన్స్‌, 6-2-959, దక్షిణభారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-4. డోర్‌నెం:8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్ట్‌, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా-522017. ఫోన్‌:0863-2286255