కుండీల ఎంపికే కీలకం

Mixed-Herbs-Flowers మిద్దెతోటల్లో కుండీల ఎంపిక ముఖ్యం. దీనికి సంబంధించిన కిటుకుల గురించి ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్‌ పిడిగెం సైదయ్య అందిస్తున్న వివరాలు.. - మొక్కలు పెరిగే ఎత్తు, పెరిగే కాలం, పోషకాల అవసరాలను బట్టి సరైన పరిమాణం ఉన్న కుండీలను, తొట్ల ను ఎంపిక చేసుకోవాలి. - పొడవుగా పెరిగే మొక్కలు, బహువార్షిక మొక్కలు పెంచడానికి లోతైన, ఎక్కువ వ్యాసార్థం ఉన్న కుండీలు ఎంపిక చేసుకోవాలి. - ప్లాస్టిక్‌ కుండీల కంటే సిమెంట్‌/మట్టితో చేసిన కుండీలలో మొక్కల పెరుగుదల బాగుంటుంది. - మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు దగ్గర దగ్గరగా ఉంచాలి. ఎదిగే కొద్దీ వాటి మధ్య దూరం పెంచాలి. - సూర్యరశ్మి బాగా తగిలే ప్రాంతాలలో ఈ కుండీలను ఉంచాలి. - సీజన్‌లో మాత్రమే వచ్చే పంటలుంటే, నీడ అవసరం ఉండే, ఎండ అవసరం ఉండే మొక్కలను వేర్వేరు తొట్ల లో ఉంచి పెంచాలి. - ఒకే సీజన్‌లో పూర్తయ్యే కొన్నిరకాల పూలు, కాయగూరలు పెంచడానికి చిన్న తొట్లు సరిపోతాయి. అదే పండ్ల మొక్కలు, బహువార్షిక పూల మొక్కలు పెంచడానికి పొడవు, వెడల్పు ఎక్కువగా ఉన్న తొట్లను ఎంపిక చేసుకోవాలి. - తొట్లకు కచ్చితంగా మురుగునీరు పోయే సౌలతి ఉండాలి. - ఎట్ట పరిస్థితుల్లోనూ తొట్లను పూర్తిగా మట్టితో నింపరాదు. నీరు పెట్టడానికి, ఎరువులు వేయడానికి తొట్టి పైభాగంలో కొంత ప్రదేశం ఖాళీగా ఉంచాలి. - మొక్కలు పెట్టే ముందు తొట్లను వేడినీటితో లేదా వేపగింజ కషాయంతో శుద్ధి చేయాలి. దీనివల్ల మొక్కలు చనిపోకుండా ఉంటాయి. - ఆసరి రాజు