చేపపిల్లల ఎంపిక, రవాణాలో జాగ్రత్తలు

చేపల పెంపకం చేపట్టే రైతులు సరైన చేపపిల్లలను ఎంపిక చేసుకోవాలి. వాటిని చెరువులలో సక్రమ విధానాలలో వదులాలి. అప్పుడే మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చేపపిల్లల ఎంపికలో అవలంబించాల్సిన పద్ధతుల గురించి కేవీకే మత్స్య శాస్త్రవేత్త బూర్గు లవకుమార్ తెలిపారు. అదనపు సమాచారం కోసం 9849063796 నెంబర్‌ను సంప్రదించవచ్చు. FIshh -భారతీయ మేజర్ కార్ప్, విదేశీ కార్ప్ చేపపిల్లలు పెంపకానికి అనువైనవి. -చెరువులలో లభించే సహజ ఆహారాన్ని కాకుండా అనుబంధ ఆహారాన్ని ఇష్ట పూర్తిగా తీసుకునేవిగా ఉండాలి. -భిన్నమైన ఆహారపు అలవాట్లతో, ప్రవర్తనతో ఉండే జాతులను ఎంపిక చేసుకోవాలి. -తాత్కాలిక ప్రతికూల పరిస్థితులను తట్టుకునేవిగా ఉండాలి. -మంచి రుచికర, పోషక విలువలు గల మాంసం కలిగినవై ఉండాలి. -సహజసిద్ధంగానే కాకుండా కృత్రిమ విధానంలోనూ పిల్లలను ఉత్పత్తి చేయగల చేపల రకాల చేపపిల్లలను ఎంపిక చేసుకోవాలి.

నాణ్యత గల చేపపిల్లల ఎంపిక

-చేపపిల్లలు చురుకుగా ఈదుతుండాలి. -చేపపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండి మెరుస్తూ ఉండాలి. -చేపపిల్లల శరీరంపై ఎలాంటి మచ్చలు, కురుపులు, గాయాలు లేకుండా ఉండాలి. -చేపపిల్లల శరీరంపై ఎలాంటి పరాన్నజీవులు లేకుండా చూసుకోవాలి. -చేపపిల్లలు ఈక, తోకలు చీలికలు లేకుండా సంపూర్ణ, సరైన స్థితిలో ఉండాలి. -చేప పిల్ల తలభాగం మిగతా శరీర భాగానికి సమతూకంగా ఉండాలి. FIshh1

చేపపిల్లల రవాణాలో జాగ్రత్తలు

-చేపపిల్లల రవాణా చేయడానికి ముందు 24 గంటల పాటు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకూడదు. -రవాణా చేయదలచిన చేపపిల్లలకు చేతిరాపిడి తగులకుండా సున్నితపు వలలో పట్టి ఉంచుకోవాలి. -రవాణా చేయు వాహనంలో ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి ఆక్సిజన్‌ను అందిస్తూ రవాణా చేసుకోవాలి. -చేపపిల్లలను తక్కువ ఉష్ణోగ్రత గత నీటిలో రవాణా చేయాలి. -చేపపిల్లలను రవాణా చేసే వ్యాన్, లారీలను ఎండలో నిలుపరాదు. -పాలిథీన్ బ్యాగ్‌లో సరైన మోతాదులో ఆక్సిజన్ ఉన్నదా, లేదా చేపపిల్లలు చురుకుగా ఉన్నాయా లేవా అనేది గమనించాలి. -పంపిణీ చేయబడిన చేపపిల్లలను ఎక్కడ ఆగకుండా నిర్దేశింపబడిన నీటి వనరు వద్దకు తీసుకపోవాలి. -నిర్దేశించిన నీటి వనరులలో మాత్రమే చేపపిల్లలను వేసుకోవాలి. -నీటి వనరులలో వేసుకునే ముందు పాలిథీన్ బ్యాగులను నీటిలోకి వదిలి అట్టి నీరు ఉష్ణోగ్రతను అలవాటు చేసి తదుపరి బ్యాగు తెరిచి లోనికి నీటి వనరులోని నీటిని కొద్దికొద్దిగా కలిపి అప్పుడు వదులాలి. నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945 గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా