దుంపజాతి కాయగూరల్లో విత్తనోత్పత్తి

Vegetables చలికాలంలో దుంప కూరగాయలు క్యారెట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌. ఇవి రాష్ట్రంలో, ఇతర రాష్ర్టాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. వీటిల్లో సూటిరకాలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. అయితే విత్తన సమస్య ఎక్కువే. అందుకే రైతులే సొంతంగా తమస్థాయిలో వీటిలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. చాలా తేలిక కూడా. వీటిలో క్యారెట్‌, ముల్లంగి, బీట్‌ రూట్‌ మూడూ పరపరాగ సంపర్కం చెందే పంటలే. కల్తీల ఏరివేత, వేర్పాటుదూరంతో విత్తన నాణ్యత సాధ్యమవుతుంది. రాష్ట్రంలో వాణిజ్యంగా ముల్లంగి, క్యారెట్‌లను రైతులు సాగుచేస్తున్నారు. వీటిలో వాతావరణ అవసరాలను బట్టి రెండు రకాలున్నాయి. మొదటిది శీతల రకాలు లేదా యూరోపియన్‌ రకాలు. రెండోది ఉష్ణరకాలు. లేదా ఆసియాటిక్‌ రకాలు. శీతల రకాల విత్తనోత్పత్తి కొండ ప్రాంతా ల్లో, ఉష్ణరకాల విత్తనోత్పత్తి మైదాన ప్రాంతాల్లో చేపడితే విత్తన నాణ్యత పెరుగుతుంది.

విత్తనోత్పత్తికి అనుకూల రకాలు

Vegetables1 ముల్లంగి

ఆసియాటిక్‌ రకాలు: కాశి శ్వేత, కాశి హ్యాన్స్‌, పూసా చట్కి, పూసా రశ్మి, జపనీస్‌ వైట్‌, కళ్యాణ్‌పూర్‌ నెం.1, కో-1, అర్క నిశాన్‌, చైనీస్‌ పింక్‌. యూరోపియన్‌ రకాలు: వైట్‌ ఐసికుల్‌, పూసా హిమాని, స్కార్‌లెట్‌ గ్లోబ్‌.

క్యారెట్‌

ఆసియాటిక్‌ రకాలు: పూసా కేసర్‌, పూసా మేఘాలి, ఐరోపా రకాలు: ఎర్లీ నాన్‌టెస్‌, బౌంటెనీ, జెనో, పూసా యమదగ్ని Vegetables2

టర్నిప్‌

ఆసియాటిక్‌ రకాలు: పూసా కాంచన్‌, పూసా శ్వేత, పంజాబ్‌ సఫేద్‌ ఐరోపా రకాలు: పూసా స్వర్ణిమ, పూసా చంద్రిమ, గోల్డెన్‌ బార్‌, స్నోబాల్‌ Vegetables3

బీట్‌రూట్‌

కేవలం ఐరోపా రకాలే ఉన్నాయి. డెట్రాయిట్‌ డార్క్‌రెడ్‌, క్రింసన్‌ గ్లోబ్‌, ఈజిప్షియన్‌, ఎర్లీ వండర్స్‌ విత్తే సమయం: (మైదాన ప్రాంతాలలో) క్యారెట్‌: అక్టోబర్‌ రెండో వారం వరకు ముల్లంగి: (ఆసియాటిక్‌ రకాలు) విత్తన మోతాదు, విత్తే దూరం, ఎరువులు ముల్లంగి: హెక్టారుకు 8-10 కిలోలు వాడాలి. వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 8 సెం.మీ దూరం పాటించాలి. హెక్టారుకు 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్‌ పోషకాలనిచ్చే ఎరువులు వాడాలి. అదనంగా హెక్టారుకు 10 కిలోల బోరాన్‌ వేయాలి. క్యారెట్‌: హెక్టారుకు 8-10 కిలోల విత్తనం వాడాలి. వరుస ల మధ్య 50 సెం.మీ, వరుసలలోని మొక్కల మధ్య 10 సెం.మీ దూరం పాటించాలి. 80 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాలను ఇచ్చే ఎరువులు వాడాలి. దుంప కూరలలో మైదాన ప్రాంతాలలో ఆసియా రకాల్లో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. అదే ఐరోపా రకాలు, శీతల రకా ల్లో విత్తనోత్పత్తి కొండ ప్రాంతాల్లో చేపట్టవచ్చు. విత్తనం నుంచి విత్తనం వరకు లేదా వేరు నుంచి విత్తనం పద్ధతిలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. అయితే భూమి నుంచి వేరును తీసి మళ్లా ప్రధాన పొలంలో నాటే విత్తనం తీసే పద్ధతిలో నాణ్యమైన విత్తనం అందుతుంది. ఎందుకంటే ప్రధాన పొలంలో నాటే సమయంలో జన్యు స్వచ్ఛత కల్గిన వేరు రకాలను ఎంచుకుని నాటుకుని విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. పూర్తిగా మార్కెట్‌ పరిమాణానికి వచ్చిన దుంపలు ఎంచుకుని, వాటిని భూమిపై అలాగే కింద 2-3 ఇంచులు ఉంచి, మిగతాది కత్తిరించాలి. వాటిని భూమిలో నాటుకోవాలి.

కల్తీల ఏరివేత

క్యారెట్‌: విత్తిన 20-30 రోజుల తర్వాత మొదటిసారి, భూమి నుంచి తీసిన తర్వాత రెండోసారి, పూత సమయంలో మూడోసారి, గింజలు ఏర్పడే దశలో కల్తీలు ఏరివేతకు నాలుగుసార్లు క్షేత్ర తనిఖీలు చేపట్టాలి. ముల్లంగి, టర్నిప్‌: విత్తిన 20-30 రోజులకు, వేర్ల ఎంపికప్పుడు, పూత సమయంలో మూడుసార్లు క్షేత్ర తనిఖీలు చేపట్టాలి. Vegetables4

కోత, విత్తన సేకరణ

ముల్లంగిలో కాయలు పసుపు పచ్చ రంగులోకి మారినప్పు డు కోయాలి. తర్వాత ఎండబెట్టి, విత్తనాలు సేకరించాలి. హెక్టారుకు 600-1000 కిలోల విత్తన దిగుబడి వస్తుంది. క్యారెట్‌లో విత్తనాలు ‘అంబెల్స్‌'లో ఏర్పడుతాయి. ప్రధానకాండంపై ఏర్పడే అంబెల్స్‌ పెద్దగా ఉంటాయి. వీటినే ‘కింగ్‌ అంబెల్స్‌' అంటారు. కొమ్మల చివర్లలో ఏర్పడేవి ద్వితీయ అంబెల్స్‌. వీటిలో పై నుంచి కిందికి పూలు ఏర్పడుతాయి. రెండో అంబెల్‌ కాండం నుంచి తృతీయ అంబె ల్స్‌ ఏర్పడుతాయి. ప్రాథమిక అంబెల్స్‌లోని విత్తనాలు బరువుగా, పరిణితి చెంది, అధిక నాణ్యతతో ఉంటాయి. అయితే అంబెల్స్‌లోని అన్ని గింజలు ఒకేసారి పక్వానికి రావు. అందుకే దఫాలుగా విత్తన సేకరణ చేయాలి. తృతీయ అంబెల్స్‌ పసుపు పచ్చ రంగులోకి మారిన తర్వాత వాటిని కోసి, నీడలో ఆరబెట్టి విత్తనం తీయాలి. హెక్టారుకు క్యారెట్‌ విత్తన పంట దిగుబడి 450-500 కిలోలు. టర్నిప్‌లో గోధుమ ఎరుపులోకి మారినప్పు డు కాయ కోత చేపట్టాలి. ఆ తర్వాత విత్తనాలు తీయాలి. విత్తన దిగుబడి హెక్టారుకు 500-600 కిలోలు.

విత్తనోత్పత్తికి అనుకూల వాతావరణం

క్యారెట్‌లో: క్యారెట్‌ చలి కాలపు పంట. అయితే ఆసియాటి క్‌ రకాల్లో 7.2 నుంచి 23.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. మైదానప్రాంతాలు, ఉష్ణమండల ప్రాంతాల్లో వీటి విత్తనోత్పత్తి తేలిక. వేసవిలో తక్కువ వర్షపాతమున్న ప్రాంతాలు మేలైనవే. యూరోపియన్‌ రకాలకు 4.8-10 డిగ్రీల ఉష్ణో గ్రత 4-6 వారాల పాటు వేరు అభివృద్ధి సమయంలో, క్షేత్రంలో అవసరం. పూలగుత్తులు ఏర్పడటానికి 12-21 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరం. 28 డిగ్రీల సెల్సి యస్‌లో పూలు ఏర్పడవు. కేవలం కొండ ప్రాంతాల్లో, బాగా చలి ఉండే ప్రదేశాల్లో వీటి విత్తనోత్పత్తి చేపట్టాలి. ముల్లంగిలో: శాఖీయ ఉత్పత్తికి వేరు అభివృద్ధికి చల్లని వాతావరణం అవసరం. ప్రధానంగా సాగులో ఉన్న రకా ల్లో ఆసియా రకాలు ఎక్కువ వేడిని తట్టుకుంటాయి. అందుబాటులో ఉన్న మూడు రకాల్లో-జపనీస్‌ లేదా వింటర్‌ ముల్లంగి చల్లని కొండ ప్రాంతాల్లో మాత్రమే విత్తనాలను ఇస్తుంది. పూతకు చల్లని వాతా వరణం అవసరం. రెండోది వైట్‌ అయిస్‌ కూల్‌. రాపిడ్‌ రెడ్‌ వైట్‌ రకాలు చల్లని వాతావరణంలో వస్తాయి. అయితే వేరు అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. మూడవ రకం-మైదాన ప్రాంతాల్లో విత్తనో త్పత్తి మేలుగా ఉంటుంది. కొండ ప్రాంతా ల్లో సైతం విత్తనోత్పత్తి సాధ్యమే. తక్కువ ఉష్ణోగ్రత పూతకు అత్యంత కీలకం. జపనీస్‌ రకాల్లో పూల అభివృద్ధికి 25-30 రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. గింజలు ఏర్పడే దశ త్వరగా ఉంటుంది. ఎక్కువ గింజల ఉత్పత్తి సాధ్యం. 32 డిగ్రీల సెల్సి యస్‌ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే పుప్పొ డి రేణువులు మొలకెత్తవు. కీలాగ్రం ఎండిపోతుంది. కాబట్టి నాణ్యమైన విత్తనోత్పత్తికి ఎక్కువ గాలి లో తేమ, చల్లని వాతావరణం అవసరం. Vegetables5 డాక్టర్‌ పిడిగెం సైదయ్య శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7780509322