వివిధ తోటల్లో వృద్ధి నియంత్రకాలతో దిగుబడి పెరుగుదల

tomato పంటల పెరుగుదల, దిగుబడులలో వాటిలో సహజంగా ఉండే వృద్ధి నియంత్రకాలది ప్రధాన పాత్ర. కృత్రిమంగా తయారుచేసిన వృద్ధి నియంత్రకాల రాకతో వాటి వాడకం పెరిగింది. వాణిజ్య పంటలలో వీటి వాడకం వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. వృద్ధి నియంత్రకాలలో ‘ఆక్సిన్‌'లు పూత శాతాన్ని, పండ్లు, గింజలు నిండటానికి ఉపయోగపడుతాయి. పూలు, మొగ్గలు, పిందెలు రాలకుం డా ఉపయోగపడుతాయి. పండ్ల పరిమాణం, నాణ్యత పెరుగుదలలోనూ ఉపయోగపడుతాయి. అఫ్ఫా నాఫ్తైల్‌ అసిటిక్‌ అమ్లం కృత్రిమంగా ఎక్కువగా వాడబడుతున్న వృద్ధి నియంత్రకం. పంట మొక్కలలో సహజంగా వృద్ధి అయ్యే ‘ఎథిలీన్‌' వాయువును మందగింఊప జేసి ‘అబ్‌సిసిన్‌' లేయర్‌ అభివృద్ధి చెందకుండా చేస్తుం ది. తద్వారా మొగ్గలు, పూలు, పిందెలు చెట్ల నుంచి రాలిపోకుండా ఉంటాయి. tomato1 వాడే విధానం: సాధారణంగా పంటలలో ఎన్‌ఎఎ వాడకాన్ని పీపీఎంల సిఫార్సు చేస్తారు. సాధారణంగా 10 పీపీఎం, 10 పీపీఎంలలో సిఫార్సు చేయబడుతుంది. 4.5 లీటర్ల నీటిలో ఒక మి.లీ. ఎన్‌ఏఏ (NAA) కలిపితే 10 పీపీఎం, 10 మి.లీ. కలిపితే 100 పీపీఎం ద్రావకరం తయారవుతుంది. దీనిని పొద్దుగాల లేదా సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేయాలి. వృద్ధి నియంత్రకాన్ని మాత్రమే పంటలపై పిచికారీ చేస్తే ఫలితాలు బాగుంటాయి. tomato2 tomato3 tomato4

వివిధ పంటలలో NAA వాడకం

మిరప: పూత సమయంలో మొదటిసారి పిచికారీ చేయాలి. 20-30 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. టమాటా: పూతకు వచ్చే ముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. మామిడి: మామిడి పిందెలు బఠాని పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి పిచికారీ చేయాలి. ‘మాల్‌ ఫార్మేషన్‌' సమస్య ఉన్నప్పుడు పూతకు మూడు నెలల ముందు ఒకసారి, పిందె ఎదిగే దశలో మరోసారి పిచికారీ చేయాలి. ద్రాక్ష: మొదటి పిచికారీ కత్తిరింపులప్పుడు; పూత మొదల య్యే దశలో రెండోసారి పిచికారీ చేయాలి. ద్రాక్ష పండ్లు రాలకుండా ఉండేందుకు, గుత్తులు కోతకు 10-15 రోజుల ముందు ముదిరిన గుత్తులపై పిచికారీ చేయాలి. ఫైనాపిల్‌: పూత దశకు ముందు ఒకసారి పిచికారీ చేయాలి. మొత్తం పండును ద్రావణంలో ఒక సెకను పాటు ముంచాలి. కోతకు రెండువారాల ముందు మరోసారి పిచికారీ చేయాలి. పూతకు -10 పీపీఎం. పత్తి: పూత సమయం నుంచి 15 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి. tomato5 డాక్టర్‌ అమరపల్లి గీత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వ్యవసాయ కళాశాల, పాలెం