మొక్కలే ఆమె ఊపిరి

ఇన్ని మొక్కలు పెంచాలంటే నిజంగా కొంచెం పిచ్చి ఉండి తీరాలి. పిచ్చి లేకపోతే పట్టణంలో ఇంత పచ్చదనం పెంచడం అంత సులువు కాదు. ఓకే. తమ ఆరోగ్యం కోసం, తమ ఆనందం కోసం కూరగాయలు, పండ్లు పెంచితే ఆ ఫలం పరిమితం. కానీ ఈమె చేస్తున్న పని అపరిమితం. అందుకే వందకు పైగా ఔషధ మొక్కల్ని పెంచి వాటి ఫలాల్ని తన ఇంటికే పరిమితం చేసుకోకుండా ఆరోగ్యాన్ని అందరికీ పంచుతున్న అమృతవల్లి ఆరోగ్య కల్పవల్లి హైమావతి.. home-crop కూకట్‌పల్లి కెపిహెచ్‌బి కాలనీ, వసంత్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి హైమావతి తాము అద్దెకు ఉన్న ఇంట్లో వందకు రకాలకుపైగా ఔషధ మొక్క లు పెంచుతుందంటే ఆమెకు మొక్కలపై ఎంత మమకారమో తెలుస్తుంది. ఇరువై ఏండ్లుగా తమ ఇంట్లో రకరకాల పూలమొక్కలు, పండ్లమొక్కలు, కూరగాయలు పండించిన హైమావతి ప్రస్తుతం ఔషధ మొక్కలపై పూర్తి దృష్టి సారించారు. మొక్కల పెంపకం అనేది తనకు చిన్ననాటి నుంచి ప్రకృతిపై ఉన్న ప్రేమ నుంచి వచ్చినా, ఔషధ మొక్క ల పెంపకంపై ప్రత్యేక దృష్టి మాత్రం అందరికీ ఆరో గ్యం అనే కోణంలోంచి వచ్చిందటారు హైమావతి. ఆధునిక జీవనశైలి తీసుకువచ్చిన మార్పుల వల్ల, ఇవాళ ప్రతిఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఐతే చిన్న చిన్న సమస్యలకు కూడా డాక్టర్ దగ్గరకు పరిగెత్తి, పూటకు గుప్పెడు మందులు వేసుకుంటున్నారు. ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల శరీరం కూడా మందులతో నిండిపోతున్నది. అసలు ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే, ప్రకృతి చూపిన బాటలో సాగాలంటారు హైమావతి. అందుకోసమే నిత్యం మనకు అవసరమైన మందుమొక్కలు మన చెంతనే ఉండాలనే ఆలోచనతో అందరికీ మందుమొక్కలను అందుబాటులో పెడుతున్నారు హైమావతి. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను ఉచితంగా ఇస్తుంటారామె. తమ ఇంట్లో పెరుగుతున్న ప్రతి మొక్కనూ చూపించి, వాటి ఔషధ గుణాల్ని వివరిస్తుంటారు. లసి, కలబంద, తిప్పతీగ, వావిలి, అర్జున, శతావరి, సరస్వతి ఆకు, పిప్పళ్లు, నేల ఉసిరి, నేల వేము, అశ్వగంధ, రణపాల, నల్లే రు, మిరియాలు, పిప్పంటి, సర్పగంధి, దుంపరాష్ట్రం, వాము, కామంచి, ఉమ్మెత్త, ఉత్తరేణి, బోడతరం, అడ్డసారం, అత్తిపత్తి, పొడపత్రి, తెల్ల ఈశ్వరి, చెన్నంగి, కొండపిండాకు, గుంటగలగర, ఇన్సులిన్ వంటి పలు ఔషధ మొక్కలే కాక గోరింట, శంకుపూ లు, మందార, లిల్లీ, పారిజాతం వంటి పూలమొక్కలు, బొప్పా యి, నేరేడు, అరటి, సీతాఫలం, నిమ్మ, ఉసిరి, యాపిల్‌బేర్, స్వీట్‌లైవ్‌ు, బత్తాయి, లక్ష్మణఫలం, కొబ్బరి వంటి పండ్లమొక్కలు కనిపిస్తాయి. వీటితోపాటు కుంకుడు, మునగ, చింత, కానుగ, పసుపు, కంద, యాలకులు, మల్టీ విటమిన్ వంటి పలురకాల మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి. home-crop2 ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుని చిన్నచిన్న ఆరోగ్యసమస్యలు తలెత్తినపుడు ఎలా వాడాలో హైమావతి వివరిస్తారు. అయితే ఇందులో పెద్దల ద్వారా తెలుసుకున్నది కొంత, అనుభవంలో అర్థం చేసుకున్నది మరికొంత అంటారు. వీటిలో కొన్ని మొక్కలను ఆయుర్వేద నిపుణుల సలహాతో నిత్యం వాడితే చాలావర కు ఆరోగ్య సమస్యలను ముందుగానే నియంత్రించుకోవచ్చంటారు హైమావతి. ఔషధ మొక్కల్లో ముందుగా తులసి ఉపయోగాల్ని తెలియనివారు లేరనే చెప్పాలి. ఉదయాన్నే పరగడపున తులసి రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుందని ఆయుర్వేదం చెబుతున్నది. ప్రతిరోజూ 5 నుంచి 25 గ్రాముల నల్ల తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే.. ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే నల్లతులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి ఆ మిశ్రమాన్నినూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంతే కాక జలుబు చేస్తే కొంచెం తులసి ఆకులు, లవంగాలు, కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే, అన్నిటి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. తులసి చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలలో ఎంతగానో ఉపయోగపడుతుంది, దగ్గు, జలుబు, విరేచనాలు, మరియు వాంతులు వంటి సాధారణ సమస్యల నుంచి విముక్తినిస్తుంది. ప్రస్తుతం కలబంద ప్రయోజనాలెన్నో పరిశోధనల్లో బయటపడ్డాయి. అలోవెరా పేరిట కలబంద ఉత్పత్తులు అనేకం అందుబాటులోకి వచ్చాయి. సబ్బుల నుంచి మందుల దాకా కలబంద ఎన్నోరకాలుగా మన వినియోగంలో ఉంది. జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటను తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకుని తింటే కడుపులో ఉన్న అన్నిరకాల వ్యాధుల్ని మటుమా యం చేస్తుంది. కప్పు నీటిలో చెంచా కలబంద రసం, చెంచా అల్లం రసం వేసి సన్నని మంటపై వేడిచేయాలి. ఈ మిశ్రమాన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు కరుగుతుంది. తిప్పతీగను ఆయుర్వేదంలో అమృతవల్లి అని అంటారు. తిప్పతీగతో తయారుచేసిన మందులను, పదార్థాలను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. అలాగే శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది. దీనిలో రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలు తిప్పతీగలో ఉంటాయి. కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది. అర్జున దీన్ని తెలుగులో మద్ది చెట్టు అంటారు. దీని బెర డు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుంది. అర్జున బెరడును పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల, ఆస్తమా ఉన్నవారికి వారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి తింటే ఆస్తమా తగ్గుతుంది. మధ్యవయస్సు స్త్రీలకు వచ్చే ఆస్టియో ప్లోరోసిస్‌కు ఇది మంచి మందు. అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి. దీని చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.

సరస్వతి మొక్క

home-crop3 ఔషధ మొక్కల్లో శతావరిని నిజంగా ఆరోగ్యవర్ధిని అని చెప్పవ చ్చు. పిత్త దోషం అదుపు చేయడానికి దీన్ని వాడతారు. హార్మోన్ల సమతౌల్యం కాపాడటంలో ఇది కీలకమైనది. కడుపులో వచ్చిన అల్సర్లు, శ్వాస సంబంధ అంటువ్యాధులు, విరేచనాలు వంటి వాటికి శతావరి చక్కనైన మందు. శతావరి వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. సరస్వతి ఆకును ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. వీటి రసాన్ని పాలల్లో కలిపి పిల్లలకు ఇస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత కలుగుతుంది. మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. మేధాశక్తిని పెంచుతుంది. ఈ ఆకుల రసం పచ్చకామెర్ల వ్యాధిని నివారించడంలో తోడ్పడటమే కాక రక్తాన్ని శుద్ధి చేయడంలోను ఉపయోగపడుతుంది. ఆ ఆకులు చూర్ణాన్ని కొద్దిగా వాము, నీళ్లతో కలిపి తీసుకుంటుంటే కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఆయుర్వేద వైద్యంలో వావిలి ఆకులను వాత సంబంధమైన నొప్పులకు, శరీరంపైన వాపులను తగ్గించడానికి వాడతారు. దీని ఆకుల రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి. ఆకులు వేసి కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది. అలాగే వావిలి ఆకులు కషా యం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. వావిలి ఆకు, గుంట గలగర ఆకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది. వావిలి ఆకు రసం, అల్లంరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. నేల ఉసిరి ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. వీటిని కామెర్ల వ్యాధిలో, చర్మరోగాల్లో, షుగర్ వంటి జబుల్లో ఉపయోగిస్తారు. కామెర్ల వ్యాధిలో ఇది అత్యంత ఉపయుక్తమైన మందు. నేల ఉసిరి చూర్ణాన్ని ఉత్తరేణి ఆకులరసాన్ని, దిరిసెన పట్ట చూర్ణాన్ని సమంగా కలిపి తేనెతో తీసుకుంటే క్రిమిరోగాలు తగ్గుతాయి. దీని కషాయం తాగితే చలి జ్వరం, దీర్ఘకాలిక జ్వరం తగ్గుతుంది. ఆకులు ముద్దగా నూరి సమపాళ్లలో ఉప్పుకలిపి వాపులపై పట్టిస్తే బాధ దూరమవుతుంది. దీని కషాయం గ్లాసునీళ్లలో కలిపి వారం రోజులు తాగితే కిడ్నిలో రాళ్లుకూడ కరుగుతాయని చెబుతారు. నేలవేము కాషాయాన్ని వారానికి మూడుసార్లు తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. ఇందులోని యాంటీ ఫంగ ల్ గుణాల వల్ల చర్వవ్యాధులలో అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన అనేక వ్యాధులలో నేలవేము అద్భుత ఫలితాలు చూపుతుంది. ఆయుర్వేదంలో అతి ఎక్కువగా వినియోగింపబడేది అశ్వగంధ. దీన్నే పెన్నేరుగడ్డ అని కూడా అంటారు. జ్ఞాపకశక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగా దీనికి పేరు ఉంది. ఇది స్త్రీలలో రక్తాన్ని శుభ్రపరిచి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఇందులో యాంటీ ఎజింగ్ గుణాలున్నాయి. అశ్వగంధ కీళ్లనొప్పులు, వాపులను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆర్థరైటిస్, యాంటీ బాక్టీరియల్, యాంటీ డిప్రెసెంట్ గుణాలు అనే కం ఉన్నాయి. ఇది ఒత్తిడిని నివారిస్తుంది. నల్లేరు నాలుగు పలకల కాండంతో సన్నగా పెరిగే తీగజాతి మొక్క విరిగిన ఎముకలను అతికించడంలో చాలా ముఖ్యమైం ది. పిల్లల ఎముకలు ధృఢంగా పెరగడానికి దోహదపడుతుంది. మధ్య వయస్కులకు కీళ్లనొప్పులు రాకుండా చూస్తుంది. కీళ్ల నొప్పులుంటే తగ్గిస్తుంది. ఎముకలు పెళుసెక్కడం, ఎముకలు పటు త్వం తగ్గడం వంటి వయోవృద్ధుల సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. రెండు చుక్కల నల్లేరు కాడల రసం చెవిలో వేస్తే పోటు తగ్గుతుంది. నల్లేరు ఆకుల రసం 1,2 చెంచాలు తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఈ నల్లేరును వంటల్లో అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ముట్టుకుంటే ముడుచుకునే అత్తిపత్తి రక్తశుద్ధి చేయడంలో చాలా ఉపయుక్తం. ఇది ముక్కు నుంచి కారే రక్తాన్ని ఆపుతుంది. షుగర్ వ్యాధి, బోధకాలు, కామెర్లను, పొడలను, కుష్టును, విరేచనాలను, జ్వరాన్ని తుంటి నొప్పిని తగ్గిస్తుంది. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో దీనిని మూత్ర వర్ధకంగాను, ఉత్తేజకారిగాను, జీర్ణకారిగాను, మలబద్ధ నివారిణిగాను ఉపయోగిస్తారు. ఇది గుండె ను, ప్లీహాన్ని ఉత్తేజపరుస్తుంది. దీనిని మధుమేహంలో, జ్వరం, ఉబ్బసం నివారణ కోసం వాడుతారు. పొడపత్రి ఆకులతో షుగ రు వ్యాధిని దూరం చేయవచ్చు. ఇంకా అనేకరకాలుగా పొడపత్రి ఆరోగ్యవర్ధినిగా పనిచేస్తున్నది. ఇవేకాక వాము, పసుపు, మిరియాలు, అల్లం, మునగ వంటి వాటి ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఇలా అన్నీ కాకపోయి నా ఇంటి వైద్యానికి అవసరమైన మొక్కలను ఉన్న కొద్ది ప్రదేశంలో నే చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చుని హైమవతి నిరూపిస్తున్నారు. ఇలా చేసుకోగలుగుతే ప్రతి చిన్నదానికి డాక్టరు దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం రాదంటారామె. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచే ఇన్సులిన్ మొక్కను హైమావతి చాలామంది పరిచయం చేశారు. దీనివల్ల ప్రయోజనం పొందినవారు మాకు చెబుతుంటే వారి కళ్లలో మెరుపును మేమెప్పటికీ మరువలేము అంటారామె. మనం మరిచిపోతు న్న, మరిచిపోయిన అనేక మొక్కలను, వాటి ఔషధగుణలను వెలుగులోకి తెస్తున్నారు. ఐతే ఆ పనంతా తన ఒక్కదానివల్లే కాలేదని, ఇందుకు తన భర్త మధు, పిల్లలు అందించిన సహకారం చాలా విలువైనదంటారామె. ఈ మొక్కల పెంపకానికి మట్టి కుండలు, వృథాగా పడేసిన ప్లాస్టిక్ డబ్బాలు వంటి రకరకా ల వ్యర్థ వస్తువులను వాడుతుంటారు. ఎవరైనా మొక్కలు పెంచాలనుకున్నపుడు కుండీలు కొత్తగా కొనడం కంటే, వాడిపారేసిన వస్తువులను పునర్వినియోగంలోకితెస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారమవుతామంటారామె. -హైమావతి గారిని సంప్రదించాల్సిన నెంబర్ 9948666645 -కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455 నేచర్స్‌వాయిస్