జింకు లోప నివారణ

zinc రాష్ట్రంలో సాగు చేస్తున్న వరి పంటలో జింకు లోపం సాధారణమైంది. సకాలంలో లోప లక్షణాలు గుర్తించి సవరిస్తే, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది.

జింకు లోపానికి దారితీసే పరిస్థితులు

సల్ఫర్ లోపంతో జింకు లోపం ముడిపడి ఉంటుంది. ప్రధానంగా తటస్థ నేలలు, సున్నపు నేలలు, ముమ్మరంగా పంటలు వేసే నేలలు,మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలలు, క్షారత్వపు, చౌడు నేలలు, ఇసుక నేలలు, ఫాస్పరస్, సిలికాన్ మూలకాలు అధికంగా ఉన్న నేలలు, కోతకు గురయ్యే నేలలు, ఆమ్ల నేలలు, గరుకు స్వభావం కలిగిన నేలలు, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం అధికంగా లిగిన నేలల్లో జింకు లోపం అధికంగా ఉంటుంది. కాలుష్యపు మురుగు నీరు పారించే నేలలు, అధికంగా సేంద్రియ ఎరువులు, పంట వ్యర్థాలు వాడే నేలల్లో కూడా జింకు లోప లక్షణాలు కనిపిస్తాయి. వరిలో అత్యధికంగా లోపించే మూలకం జింకు. ఆధునిక రకాలు, పంటల ముమ్మర సాగు, జింకు అధికంగా తీసుకునే రకాల వాడకంతో లోప లక్షణాలు పెరుగుతున్నాయి.

లోప లక్షణాలు

-సాధారణంగా ప్రధాన పొలంలో నాటిన రెండు నుంచి నాలుగు వారాలలో జింకు లోప లక్షణాలు కనిపిస్తాయి. -మొక్కలు గిడసబారుతాయి. గిడస బారిన మొక్కలపై ఆకులపై బ్రౌన్ మచ్చలు కనిపిస్తాయి. -మొక్కలు అసహజంగా పెరుగుతాయి. -పొలంలో అక్కడక్కడ అంతగా ఎన్నుకోని మొక్కలు ఉంటాయి. -నత్రజని ఎరువులు వేసిన పైరు పచ్చపడదు. -కంకులలో తాలు ఏర్పడుతుంది. -లేత ఆకులలో మొదలు దగ్గర మధ్య ఈనెలు పాలిపోతాయి. -ఆకు మధ్య ఈనెలు పాలిపోతాయి. ఆకు మధ్య ఈనెల వెంబడి తెల్లని చార ఏర్పడుతుంది. -ఆకు వ్యాసార్థం తగ్గుతుంది. ఆకులు పెలుసుగా ఉండి, వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. -ఆకులు సామర్థ్యం కోల్పోయి, ఉదా రంగులోకి మారుతాయి. పొలంలో నీరు ఎక్కువగా ఉన్న సమయంలో బైకార్బోనేట్లు సాంద్రత పెరిగి పంట తొలి దశలో జింకు లోపం లేత ఆకులలో కన్పిస్తుంది. అయితే 4-6 వారాలలో పంట తిప్పుకుంటుంది. ఒకవేళ మొదటల్లో లోప లక్షణాలు ఎక్కువగా ఉంటే పంట ఆలస్యంగా కోతకు వస్తుంది. దిగుబడులు తగ్గుతాయి. * జింకు లోప లక్షణాలు- ఇనుప ధాతు లోప లక్షణాలతో టుంగ్రో వైరస్ లక్షణాలతో పోలి ఉంటాయి. అయితే ఇనుప ధాతువు ఎక్కువగా వేసి పంటల్లో దాదాపు అవే లక్షణాలు కన్పిస్తాయి.

లోప లక్షణాల సవరణ

-వరి నారుమడులలో జింకు సల్ఫేట్ వెదజల్లాలి. -2-4 శాతం జింకు ఆక్సైడ్ ద్రావణంలో నారు ముంచి ప్రధాన పొలంలో నాటాలి. -వరి పంట పండించే భూములలో ప్రతి మూడు పైర్లకు ఒకసారి, రెండు పంటలు పండించినైట్లెతే ప్రతి యాసంగి కాలంలో ఆఖరి దమ్ములో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. లేదా లీటరు నీటికి 20 గ్రాముల జింకు సల్ఫేటు కలిపి ఐదురోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. -జింకు సల్ఫేట్ భాస్వరం ఎరువుతో కలిపి వేయరాదు. ఈ రెండింటి వాడకానికి మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. పురుగు, -తెగుళ్ల మందులను జింకు సల్ఫేట్ ద్రావణంలో కలిపి వాడరాదు. dr-a-geetha