తక్కువ సమయం నికర ఆదాయం

మన ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉన్న ఆహార పదార్థాలకు ప్రాధాన్యం పెరుగుతున్నది. వాటిలో ఆకుకూరలు ప్రధానమైనవి. దాదాపు అన్ని ఆకుకూరలలో కంటే అధిక ఆహార విలువ కలిగినది పాలకూర. Leafy-vegetables వాతావరణం: పాలకూర ఉష్ణ ప్రాంత పు పంట. అయితే మధ్యస్థ చలి కాలం లోనూ వస్తుంది. కొంతవరకు మంచును సైతం తట్టుకుంటుంది. నేలలు: మురుగు నీరు పోయే సౌలతి ఉన్న అన్నినేలల్లో పాలకూర సాగు చేయవచ్చు. అయితే ఇసుక నేలలు, ఒండ్రు నేలలు సాగు చేసుకోవడానికి చాలా అనుకూలం. ఆమ్ల నేలల్లో పెరుగుదల తక్కువ. ఆకుకూర బాగా ఎదిగేందుకు ఉదజని సూచిక 6-7 మధ్య ఉండాలి. నేలను 4-6 సార్లు మెత్తగా దున్ని, చదు ను చేసి, మడులుగా తయారుచేసుకుని నాటుకోవాలి.

రకాలు:

పూసా ఆల్‌గ్రీన్: ఈ రకం పచ్చని మెత్తని ఆకులను ఉత్పత్తి చేస్తుంది. విత్తే సమయాన్ని బట్టి ఆరు కోతల వరకు తీసుకోవచ్చు. దిగుబడి హెక్టారుకు సుమారు 125 క్వింటాళ్లు వస్తుంది. పూసాజ్యోతి: ఈ రకం వెడల్పయిన పచ్చని, మందమైన, మెత్తని రుచిగా ఉంటే ఆకులను ఇస్తాయి. మొక్కలలో ఎదుగుదల చాలా ఎక్కువ. ప్రతి కోత వెంటనే త్వరగా పెరుగుతుంది. 6-8 కోతలు తీసుకోవచ్చు. హెక్టారుకు దాదా పు 200-400 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
పాలకూరలో పుష్కలమైన ఖనిజ లవణాలున్నాయి. అందుకే దీన్ని ఖనిజ లవణాల ఘని అంటారు. ఇందులో ఏ, సీ విటమిన్లు అధికంగా ఉంటాయి. మెత్తని ఫైబర్ కూడా ఉండి, శరీరానికి కావాల్సినంత అందిస్తుంది. అందుకే మార్కెట్‌లో ఏ కాలంలో అయినా పాలకూరకు చాలా డిమాండు ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగవుతున్న ఆకు కూర ఇది. రైతులు ఈ పంటను తేలికగా సాగు చేసుకోవచ్చు. తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తుంది. పెట్టుబడి కూడా తొందరగానే తిరిగి వస్తుంది. అయితే ఈ పంట విస్తీర్ణమంతా ఒకేసారి కాకుండా, దఫాలుగా నాటుకుంటే మంచిది.
జాబ్‌నగర్ గ్రీన్: ఆకు పచ్చని, దళసరి, మెత్తని ఏకరీతి ఆకులను ఇస్తుంది. సువాసన వస్తుంది. 270 క్వింటాళ్లు హెక్టారుకు దిగుబడి. నేలలో ఉదజని సూచిక 10 పైన ఉన్నప్పటికీ విజయవంతంగా సాగు చేయవచ్చు. పూసా హరిత్: చల్లని ప్రాంతాలలో సాగుకు చాలా అనువైన రకం. వెడల్పాటి ఆకులు, త్వరగా విత్తనం ఏర్పడదు. అధిక దిగుబడినిచ్చే రకం. సాగు కాలం: అక్టోబర్ నుంచి విత్తుకోవచ్చు. అయితే నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో నాటిన పంట మేలైన దిగుబడిని ఇస్తుంది. విత్తన మోతాదు: హెక్టారుకు రకాన్ని బట్టి 28-35 కిలోలు. విత్తే దూరం: వరుసల మధ్య 20 సెం.మీ, వరుసలలోని మొక్కల మధ్య 10 సెం.మీ దూరం పాటించాలి. Leafy-vegetables2 విత్తే విధానం: ప్రతి విత్తన బాల్‌లో 2-3 విత్తనాలుంటాయి. ప్రతి కుదురుకు వాటిని విడదీసి ఒకే విత్తనాన్ని విత్తాలి. అనుకూలమైన పరిమాణంలో మడులు తయారుచేసి, 20 సెం.మీ. దూరంలో గీతలు గీయాలి. ఆ సాళ్లలో గింజలు పైపైగా నాటి, వాటిపై పలుచగా మట్టిని చల్లాలి. 3-4 సెం.మీ. మించి లోతులో నాటరాదు. నాటిన 8-10 రోజుల్లో మొలకెత్తుతాయి. ఎరువులు: చివరి దుక్కిలో హెక్టారుకు 25 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. ప్రతి ఆకు కోత తర్వా త హెక్టారుకు 60 కిలోల నత్రజనినిచ్చే ఎరువు పైపాటుగా వేయాలి. దుక్కి అప్పుడే హెక్టారుకు 60 కిలోల భాస్వ రం, 40 కిలోల పొటాష్‌ల నిచ్చే ఎరువులను వేయాలి. అంతర కృషి, నీటియాజమాన్యం: విత్తిన 20 రోజుల నాటి నుంచి ప్రతి 15 రోజులకొకసారి కలుపు నివారణ, అంతరకృషి చేయాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడినివ్వాలి. ఆ తర్వాత మూడవరోజు ప్రతి 7-10 రోజులకు ఒకసారి చొప్పున నీటి తడులివ్వాలి. కోత, దిగుబడి: నాటిన 6-8 వారాల తర్వాత ఆకులు కోతకు సిద్ధంగా ఉంటా యి. 3-4 ఇంచుల పొడవున్న చివరి ఆకులను కోయాలి. మొత్తం ఆకులను కాకుండా ఇలా ఒక మొక్క నుంచి దఫాలుగా కోస్తే, ఆకుల దిగుబడి పెరుగుతుం ది. సరాసరిన ఒక మొక్క 4-6 కోతలను ఇస్తుంది. హెక్టారుకు సరాసరిన 80-100 క్వింటాళ్ల దిగుబడి సాధ్యం అవుతుంది. కోసిన వెంటనే ఆకులను కట్టలు గా కట్టి మార్కెట్‌కు తరలించాలి. గింజ లు కట్టకముందే మొత్తం ఆకులను కోయాలి. లేదంటే ఉష్ణోగ్రతలు పెరిగితే పంట పూతకొచ్చి, విత్తనాలు ఇస్తుంది. ఆకుల ఉత్పత్తి తగ్గిపోతుంది. సస్యరక్షణ: ప్రధానంగా పేను బంక, ఇతర ఆకుల నుంచి రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువ. దీంతో ఆకులు ముడుతలు పడి మొక్కలు చనిపోతా యి. వీటిని గుర్తించిన వెంటనే 2 గ్రాము ల మలాథియాన్‌ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అయితే పుగు మందు పిచికారీ చేసిన 7రోజుల తర్వాతే ఆకు కోత చేపట్టాలి. Greenhouse-spinach

విత్తనోత్పత్తి

పాలకూర సాగు తేలిక. అయితే నాణ్యమైన విత్తన కొరత ఉన్నది. రైతులు తమ స్థాయి లో విత్తనోత్పత్తి చేపట్టి తర్వాత సాగుకు వాడుకోవచ్చు. అయితే ఇందు కు కొన్ని కిటుకులు పాటించాలి. కనీసం 1000 మీటర్ల వేర్పాటు దూరం పాటించాలి. వరుసల మధ్య 60 సెం.మీ, మొక్కల మధ్య 30 సెం.మీ దూరం ఉండాలి. క్షేత్ర తనిఖీకి గాను ప్రతి ఐదు వరుసల తర్వాత ఒక వరుస ఖాళీగా ఉంచాలి. శాఖీయ దశలో, విత్తనం ఏర్పడే దశ, విత్తన సేకరణ సమయంలో మూడోసారి క్షేత్ర తనిఖీలు చేపట్టాలి. ఆకుల లక్షణాల ఆధారంగా, ముందుగా విత్తనాలు ఇచ్చే మొక్కలను కేళీలుగా గుర్తించి ఏరివేయాలి. విత్తనాలు మొక్క మీద ఉదా రంగులోకి మారినప్పుడు మొక్కలు సేకరించాలి. కోత తర్వాత క్షేత్రంలోనే క్యూరింగ్ కోసం ఉంచాలి. ఒకవారం పాటు ఆరబెట్టి ఆ తర్వాత విత్తనం తీయాలి. dr-p-sidaiah