బోరాన్ లోప నివారణ

పంటల్లో అధిక దిగుబడులు, నాణ్యత పెంపొందించడంలో ఇతర పోషకాలతో పాటు సూక్ష్మధాతు పోషకాలది ప్రధాన పాత్ర. అయితే పంటల్లో బోరాన్ సూక్ష్మ మూలకం లోపిస్తే పంటల నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి మిగతా ఎరువులతో పాటు సిఫార్సు చేసిన పంటల్లో దీన్ని తప్పకుండా వాడాలి. పండ్లు, కాయగూరలు, ఆహారధాన్యపు పంటలు, నూనె గింజల్లో బోరాన్ ధాతు తప్పనిసరిగా సిఫార్సు చేసిన మోతాదులో వాడాలి. carrot

లోప లక్షణాలు:

క్యారెట్: ఆకులు ఎర్రబారుతాయి. క్యారెట్ దుంపలు పగిలిపోతాయి. రకాన్ని బట్టి 30-70 పీపీఎంల బోరాక్స్ వాడి లోప లక్షణాలను నివారించాలి. క్యాలీఫ్లవర్: ఆకులు ముడుతపడుతాయి. కాండం డొల్లగా మారుతుంది. పూలు గిడస బారుతాయి. ఉదారంగులోకి మారుతాయి. ఈ పంటలో బోరాన్ లోప నివారణకు 30-60 పీపీఎం బోరాక్స్ వాడాలి. బీట్‌రూట్: దుంపలపై మచ్చలు ఏర్పడుతాయి. పగులుతాయి. గజ్జిలాగా కన్పిస్తుంది. 30-70 పీపీఎంల బోరాక్స్ వాడి సవరించాలి. టమాటా: బోరాన్ లోపిస్తే టమాటా పంట ఆకులు మందంగా తయారై గిడస బారుతాయి. కాయలు ఏర్పడవు. 30-100 పీపీఎం బోరాక్స్ వాడి దీన్ని నివారించవచ్చు. తీపిజొన్న: బోరాన్ లోపిస్తే చివర్ల ఎదుగవు. చనిపోతాయి. కండెలు పొట్టిగా ఉండి, వంగిపోతాయి. పూగుత్తులు డొల్లగా ఉంటాయి. గింజి పాలు పోసుకోదు. కొత్తగా ఏర్పడే ఆకుల మీద పారదర్శక, నీటి చారలు ఏర్పడి, తర్వాత తెల్లగా మారుతాయి. దీని నివారణకు 5025 పీపీఎం బోరాక్స్ వాడాలి. ఆలుగడ్డ: దుంప మధ్యలో నల్లని దుంపలేని కేంద్రం ఏర్పడుతుంది. దీన్ని డొల్ల గుండె అంటారు. 40-70 పీపీఎంల బోరాక్స్ పిచికారీ చేసి లోపాన్ని నివారించవచ్చు. చిలగడ దుంప: ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోతాయి. ఆకు మధ్య ఈనె పగిలిపోతుంది. దుంప ఎదిగే భాగం కుళ్లిపోతుంది. దుంపలోని కణజాలం ఉదా రంగులోకి మారుతుంది. 25-50 పీపీఎంల బోరాక్స్ వాడాలి. పొద్దుతిరుగుడు: ఆకులు ఎండినట్టు కన్పిస్తాయి. ఆకుల కాడలు సన్నగిల్లి పొద్దుతిరుగుడు తలలు పడిపోతాయి. 50-150 పీపీఎం బోరాక్స్ వాడాలి. పల్లి: బోరాన్ ధాతు లోపించిన పల్లి మొక్కలు పొట్టిగా పొదగా కన్పిస్తాయి. ఆకులలో ఈనెల మధ్య భాగం పత్రహరితం కోల్పోయి ఉంటాయి. నివారణకు 25-50 పీపీఎం బోరాక్స్ వాడాలి. పత్తి: పత్తి పిందెలు, చిన్న కాయలు రాలిపోతాయి. పిందెల కాడలు పగిలిపోయి, వాటి నుంచి నల్లని ద్రవం కారుతుంది. రంగు మారుతుంది. ఆకులు, పిందెలు సగమే తెరుచుకుంటాయి. 21-80 పీపీఎం బోరాక్స్ పిచికారీ చేయాలి. చిక్కుడు: మొక్కలు గిడసబారుతాయి. ఆకులు మందంగా ఉంటాయి. ఆకుల చివర్లు ముడుచుకుంటాయి. 15-50 పీపీఎం బోరాక్స్ రకాన్ని, నేలను బట్టి పిచికారీ చేయాలి. సోయాచిక్కుడు: ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఈనెల మధ్య పసుపు రంగు ఏర్పడుతుంది. ఆకు చివర్లు కిందికి ముడుచుకుంటాయి. ఎదిగే చివర్లు చనిపోతాయి. పూత ఉండదు. వేర్లు గిడసబారుతాయి. 20-50 పీపీఎం బోరాక్స్ పిచికారీ చేయాలి. నిమ్మ, బత్తాయి: తొడిమ, కాయలు కలిసే దగ్గర గట్టిపడిన వృత్తాకార వలయం ఏర్పడుతుంది. వాటి నుంచి చిక్కటి ద్రవం వస్తుంది. రంగు మారుతాయి. దీనిలో బోరాన్ ధాతు లోపం నివారణకు 30-100 పీపీఎం బోరాక్స్ కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. dr-a-geetha