తీగజాతి కాయగూరల్లో విత్తనోత్పత్తి

నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే. సాగులో వాడే ఎరువులు, సాగునీరు, ఇతర ఉత్పత్తి కారకాల సామర్థ్యం విత్తనం నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే పంటల సాగులో నాణ్యమైన విత్తనానిదే ప్రధాన పాత్ర. ప్రతి పంటకు సిఫార్సు చేసినవిత్తన మొలక శాతం, తేమ, భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత కలిగిన విత్తనాలను వాడాలి. అప్పుడే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. watermelon కాయగూర పంటల్లో నాణ్యమైన విత్తనంతోనే లాభసాటి దిగుబడులు సాధ్యం. మార్కెట్లో కాయగూరల విత్తనాలు లభ్యమవుతున్నాయి. అయితే వాటి నాణ్యతపై అంతగా భరోసా లేదు. కాబట్టి రైతాంగం తమస్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. విత్తనోత్పత్తి సులభం కూడా. తక్కువ ఖర్చుతో తగిన మోతాదులో రైతులు విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే అన్నికాయగూరల పంటలలో విత్తనోత్పత్తి సాధ్యం కాదు. టమాటా, వంకాయ, మిరప పంటలతో పాటు తీగజాతి పంటలు, గోరుచిక్కుడు, తోటకూర మొదలైన ఉష్ణ ప్రాంతపు పంటలలో మాత్రమే విత్తనోత్పత్తి సాధ్యం. చలికాలం పంటలైన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలైన పంటలు మన ప్రాంతంలో విత్తనోత్పత్తి సాధ్యం కాదు. విత్తనోత్పత్తి చేపట్టే ప్రాంతంలో పరిస్థితు లు విత్తన నాణ్యతపై ప్రభావం చూపుతాయి. అధికంగా రాత్రి ఉష్ణోగ్రతలున్న ప్రాంతా లు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు విత్తనోత్పత్తికి పనికిరావు. విత్తనోత్పత్తి ప్రాంతంలో పగలు సూర్యరశ్మి కనీసం 10 నుంచి 12 గంటలు ఉండాలి. ముఖ్యంగా కాయలు కోత కొచ్చే సమయంలో వర్షాలు రాకుండా ముందుగానే విత్తనాలు పొలంలో వేసుకోవాలి. seeds-vegetables2 విత్తనోత్పత్తి చేసే ముందు కొన్ని అంశాల్లో జాగ్రత్త వహించాలి. మొదటిది ముందు గా నిర్ణయించుకున్న అధీకృత డీలరు లేదా పరిశోధనా స్థానం నుంచి ఫౌండేషన్ విత్తనం సేకరించుకోవా లి. రెండోది-విత్తన దూరం పాటించాలి. ఒక్క టమాటాలో తప్పితే చాలాపంట్లో తరచు పరపరాగ సంపర్కం లేదా పూర్తిగా పరపరాగ సంపర్కం జరుగుతుంది. దీనివల్ల విత్తనంలో కల్తీలు ఏర్పడుతాయి. వాటి నాణ్యత తగ్గుతుంది. అందువల్ల వేర్పాటు దూరం కచ్చితంగా పాటించాలి. మూడు రకాలుగా వేర్పాటు ఉంటుంది. సమయం, వేర్పాటు దూరం, ఆటంకం వేర్పాటు. విత్తనోత్పత్తి చేపట్టే ఒక పంట వేసిన తర్వాత కనీసం 20 నుంచి 25 రోజుల సమయం తర్వాత వేరే విత్తన పంట వేసుకోవాలి. అప్పుడు కల్తీలు ఉండవు. అది సాధ్యం కాకపోతే సిఫార్సు మోతాదులో వేర్పాటు దూరం పాటించాలి. మూల విత్తనం, బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ ధృవీకరణ విత్తనం ఉత్పత్తిలో ధృవీకరణ విత్తన ఉత్పత్తిని మాత్రమే రైతులు చేపట్టవచ్చు. cucumber

తీగజాతి కూరగాయలు

కాకర, గుమ్మడి, బూడిద గుమ్మడి, దోస రకా ల్లో వాటి పండ్ల రంగును, కాడ రంగును, తీగలు ఎండిపోవడాన్ని బట్టి పక్వానికి వచ్చాయని నిర్ధారించుకోవచ్చు. అలా పండిన కాయల నుంచి విత్తనా న్ని సేకరించుకోవాలి. తర్వాత పండ్లను కోసి చేతితో విత్తనాన్ని వేరు చేసి సేకరించుకోవాలి. తర్వాత విత్తనాన్ని నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి. ఎకరాకు పంటను బట్టి 120-320 కిలోల విత్తనం దిగుబడి పొందవచ్చు. అన్ని కాయగూరలు విత్తనోత్పత్తికి కోత అనంతరం పండ్లను 5-7 రోజులు నిల్వ ఉంచినట్లయితే విత్తనం బాగా అభివృద్ధి చెంది నాణ్యంగా ఉంటుంది. maskmilon కోత సమయం: బూడిద గుమ్మడి-90 రోజులు, తర్బూ జ, ఖర్బూజలో 80-85 రోజులు పడుతుంది. దోసలో పండ్లు పేవళ పసుపు నుంచి బంగారు పసుపు రంగులోకి మారినప్పుడు పండ్లను సేకరించాలి. గుమ్మడి-గుజ్జు నుంచి గింజలు బయటకు వచ్చినప్పుడు ఖర్బూజలో-ఫుల్ స్లిప్ దశ; తర్బూజలో కాయ కింద రంగు ఆకుపచ్చ తెలుపు నుంచి పసుపు రంగులో కి మారినప్పు డు; కాకర, పొట్ల లో పండ్ల రంగు పసుపులోకి మారినప్పుడు వాటిని సేకరించాలి. విత్తన సేకరణకు ముందుగా ఏర్పడిన, పూర్తిగా పండిన పండ్లనే పరిగణించాలి. బీర, సొర, పొట్లలో కాయల లోపల గింజల శబ్దం గమనించినప్పుడు వాటిని పగులగొట్టి విత్తనాలు సేకరించాలి. మిగతా వాటిలో గుజ్జు, విత్తనం కలిసి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా సేకరించాలి. రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పొడి పద్ధతి: సేకరించిన పండ్లను ఎండబెట్టాలి. ఆ తర్వా త ఒకవైపు రంధ్రం చేయాలి. విత్తనాలు సేకరించాలి. పొట్ల, బీరలలో విత్తనం సేకరించవచ్చు. seeds-vegetables3 తడి పద్ధతి: దోస, తర్బూజ, ఖర్బూజ, కాకర, బూడిద గుమ్మడిలలో విత్త న సేకరణకు వాడుతారు. దోస, కాకరలలో కాయలను నిలువుగా చీల్చాలి. విత్తనాలు తీయాలి. గుమ్మడి, ఖర్బూజాలలో కాయలను రెండుగా కోసి, విత్తనం, గుజ్జును బైటికి తీయాలి. ఆ తర్వాత గుజ్జు నుంచి విత్తనాలు సేకరించాలి. అందుకు మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. 1) యాంత్రిక సేకరణ పద్ధతి: దీనిలో యంత్రం పండ్లను ముక్కలుగా కోసి, గుజ్జునిస్తుంది. ఆ తర్వాత గుజ్జు నుంచి విత్తనాలు వేరు చేస్తుంది. సొర, తూర్బూజ, బూడిద గుమ్మడిలో ఈ పద్ధతిలో విత్తన సేకరణ చేయవచ్చు. తక్కు వ కాలంలో, తక్కువ ఖర్చుతో ఈ పద్ధతిలో విత్తనం సేకరించవచ్చు. విత్తనం మెరుస్తుంది. అయితే ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. 2) సహజంగా పులియబెట్టే పద్ధతి: ఈ పద్ధతిలో పండ్ల నుంచి తీసిన గుజ్జును ఇనుప, ప్లాస్టి క్, చెక్క బకెట్‌లలో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 48 గంటల పాటు నిల్వ ఉంచాలి. 2,3 సార్లు బాగా కలిపి, నీటితో 2,3 సార్లు కడుగాలి. అయితే ఈ పద్ధతిలో సేకరించిన గింజల లో రంగు కోల్పోతాయి. 3) రసాయనాలతో విత్తన సేకరణ: 25-30 మి.లీ. హైడ్రోక్లోరికామ్లం లేదా 8-10 మి.లీ. వాణిజ్య హైడ్రోజన్ సల్ఫైడ్ ఆమ్లాలను 5 కిలోల పండ్ల గుజ్జుకు కలిపి, కొంత నీటిని చేర్చి బాగా కలియబెట్టాలి. ముప్ఫై నిమిషాల తర్వాత చూస్తే గింజలు నీటిలో అడుగుకు చేరుతాయి. గుజ్జు పైకి వస్తుంది. శుభ్రమైన నీటితో కడిగి విత్తనాలు నిల్వ చేసుకోవాలి. తక్కువ కాలంలో విత్తన సేకరణ ఈ పద్ధతిలో సాధ్యం. seeds-vegetables4

విత్తన దిగుబడి

హెక్టారుకు దోస 1-2 క్వింటాళ్లు, బీర, కాకర-4నుంచి 5 క్వింటాళ్లు, సొర-5-6 క్వింటాళ్లు, తర్బూజ, ఖర్బూజలలో 2-3 క్వింటాళ్లు విత్తన దిగుబడి వస్తుంది. dr-k-r-reddy