సిరులు కురిపిస్తున్నడ్రాగన్ ఫ్రూట్ సాగు

విదేశాలలో ఎక్కువగా సాగుచేసే డ్రాగన్ ఫ్రూట్‌లో మంచి ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. ఈ ఫ్రూట్‌ను అమెరికా, మెక్సికో, చైన, ఆస్ట్రేలియా, ఇజ్రయిల్, థాయిలాండ్, శ్రీలంక, వియత్నాం తదితర దేశాల్లో పండిస్తుంటారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని హద్నూర్ గ్రామానికి చెందిన మతంశెట్టి వీరేందర్ అనే యువరైతు డ్రాగన్‌ఫ్రూట్స్ పండిస్తూ మంచి లాభాలను సాధిస్తున్నాడు. dragon-fruit2 సమశీతోష్ణస్థితి వాతావరణంలో పండే డ్రాగన్ ప్రూట్స్ ఈ ప్రాంతంలోని భూములు కూడా అనుకూలమైనవి. డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుని ఇక్కడ పండించాలన్న లక్ష్యంతో రెండేండ్ల కిందట ప్రారంభించాను. కేరళ నుంచి ఈ మొక్కలను తెప్పించాను. ఈ సాగు చేసేందుకు పొలంలో ట్రాక్టర్ తిరిగేంత సమదూరంలో 10/10 పద్ధతిలో ఎకరాకు 400 కడీలను నాటాలి. వాటికి తీగలు కట్టుకోవాలి. మొదట కదురుకు ఒక మొక్క చొప్పున నాటి పెంచా లి. మొక్కలకు డ్రిప్ పద్ధతిలో రోజుకు 8-10 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. మొక్కలకు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలి. కడీ ల మధ్య పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఈ సాగు చేసేందుకు ఎకరానికి రూ.5-6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ పంట దాదాపు 30 ఏండ్ల వరకు వస్తుంది. ఈ పంట నాటిన ఏడాదిన్నర కాలంలోనే కాత కాస్తుంది. జూన్ నెలలో పూత మొదలై విడతల వారిగా డిసెంబర్ దాకా పండ్లు పండుతాయని వీరేందర్ తెలిపాడు. ఈ పంట సాగులో అనుసరించే యాజమాన్య పద్ధతులను బట్టి కాయ 350-500 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పంట మొదటి, రెండవ సంవత్సరం ఎకరాకు టన్ను చొప్పున, మూడవ సంవత్సరం నుంచి ఎకరాకు నాలుగు టన్నుల వరకు దిగుబడి వస్తుంది వీరేందర్ తెలిపాడు. dragon-fruit

ఈ పండుతో అనేక ప్రయోజనాలు

డ్రాగన్స్ ఫ్రూట్స్ పండ్లతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండును తినడం వల్ల గుండెకు మంచిదంటున్నారు. ఇందులోని ఫైబర్ జీర్ణాశయాన్ని మెరుగు పరిచి, మలబద్ధకాన్ని తొలిగిస్తుంది. ఇందులోని కాల్షియం, ఐరన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. -గున్నాల విఠల్, 9000280392 న్యాల్‌కల్ dragon-fruit3

అధిక లాభాలు

ఈ సాగులో లాభాలు బాగుంటాయి. ఈ పంటకు ఎక్కువగా తెగుళ్ల బెడత ఉండదు. నీటి ఎద్దడిని తట్టుకుంటుం ది. ఎర్ర నేలలు, ఎర్ర ఇసుక, సేంద్రి య పదార్థాలు అధికంగా ఉండి, నీటి నిల్వ తక్కువగా ఉన్న నేలలు ఈ పంట పండించేందుకు అనుకూలం. మొదటి, రెండవ సంవత్సరం దిగుబడి తక్కువ ఉంటుంది. మూడవ సంవత్సరం నుంచి అన్ని ఖర్చులు పోను ఎకరానికి 2-3 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. చెట్టుకు 25 రోజుల ఒకసారి పండ్లు కాస్తాయి. ఈ ప్రాంతంలో ఎక్కడా పండ్లను పండించకపోవడంతో వ్యాపారులు నేరుగా మా దగ్గరికే వచ్చి కిలోకు రూ. 100-200 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ పండ్లకు మార్కెట్‌లో కిలోకు దాదాపు రూ.300-400 వరకు ధర ఉన్నది. -మతంశెట్టి వీరేందర్,9666140000 యువరైతు, హద్నూర్