వృద్ధి నియంత్రకాలతో అధిక దిగుబడి

* చిలగడ దుంప నాటిన 15 రోజుల తర్వాత ఈ పదిహేను రోజుల వ్యవధిలో ఇథ్రెల్ ను 250 పీపీయం పిచికారీ చేస్తే దుంపల దిగుబడి పెరుగుతుంది. * బూడిద గుమ్మడి నాటిన 10-15 రోజుల తర్వాత నుంచి వారంరోజుల వ్యవధిలో నాలుగుసార్లు ఇథ్రెల్‌ను 250 పీపీయం చొప్పున పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుంది. అదే సొర, కాకర, పొట్ల మొక్కలపై అయితే ఇథ్రెల్‌ను 100 పీపీయం చొప్పున పిచికారీ చేయాలి. pineapple * ఫైనాపిల్ 35-40 ఆకుల దశలో ఉండి, పూతలో ఉన్నప్పుడు 10 పీపీయం ప్లానోఫిక్స్ 2 శాతం యూరి యా, 0.04 శాతం సోడియం కార్బొనేట్, 20 పీపీ యం ఇథ్రెల్‌ను మొక్కకు 50 మిల్లీలీటర్ల చొప్పున క్రౌన్‌పై పిచికారీ చేయాలి. దీంతో పూత, కాయల పరిమాణం పెరుగుతుంది. coconut * కొబ్బరిలో పూత వచ్చిన నెలకు 30 పీపీయంల 2,4-డి పిచికారీ చేస్తే 30 శాతం వరకు దిగుబడి పెరుగుతుంది. 1000 పీపీయం ఇథ్రెల్‌ను పిచికారీ చేస్తే ఏడురోజుల్లో బత్తాయిలో పసుపు రంగు, అరటి రెండు రోజుల్లో రంగు మారుతుంది. * 1000 పీపీయం ఇథెఫెన్ మామిడిపై పిచికారీ చేస్తే చర్మం రంగు మారుతుంది. త్వరగా పండిపోతుంది. papaya * సోడియం హైడ్రాక్సైడ్‌తో కలిపి 500 పీపీయం ఇథెఫెన్‌ను సపోటాపై పిచికారీ చేస్తే రెండు రోజుల్లో పక్వానికి వస్తాయి. అదే బొప్పాయిలో అయితే 2000 పీపీయం వాడాలి. potato-crops * క్యారెట్, ఆలుగడ్డలలో పూత, గింజ ఏర్పడటానికి 500 పీపీయంల చొప్పున జిబ్బరెలిక్ ఆమ్లం పిచికారీ చేయాలి. * పల్లిలో మెపిక్యాట్ క్లోరైడ్‌ను 125 పీపీయంల చొప్పు న పిచికారీ చేస్తే దిగుబడి పెరుగుతుంది. dr-a-geetha