ఒలింపిక్స్ అర్హత టోర్నీకి అమిత్, కౌశిక్

Amith ఎక్టరీన్‌బర్గ్(రష్యా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్న అమిత్ పంగల్, మనీశ్ కౌశిక్ ఒలింపిక్స్ అర్హత టోర్నీకి బెర్తు దక్కించుకున్నారు. మెగాటోర్నీ చరిత్రలో ఇద్దరు భారత బాక్సర్లు సెమీస్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన బాక్సర్లు నేరుగా అర్హత టోర్నీలో పోటీపడుతారని భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్‌ఐ) స్పష్టం చేసింది.