టోక్యో ఒలింపిక్స్‌కు వినేశ్‌ ఫోగట్‌కు అర్హత

- రెజ్లింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వినేశ్‌ కాంస్య పట్టు - గ్రీక్‌ రెజ్లర్‌ మారియాపై అద్భుత విజయం - పతకం గెలిచిన ఐదో భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇది నా తొలి పతకం. 10నెలల క్రితం 53కేజీల విభాగానికి మారా. ఇప్పుడు పతకం సాధించా. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు సాధించిన అత్యుత్తమ పతకం ఇదే. కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియా క్రీడల స్వర్ణ విజేత వినేశ్‌ ఫోగట్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతక కాంక్షను తీర్చుకుంది. ప్రపంచ పోరులో గత మూడుసార్లు పతకం సాధించడంలో విఫలమైనా నాలుగోసారి పట్టుదలతో కాంస్యాన్ని ఒడిసి పట్టి.. భారత అత్యంత విజయవంతమైన మహిళా రెజ్లర్‌గా నిలిచింది. రెండో రౌండ్‌లో ఓడి స్వర్ణం ఆశలు ఆవిరైనా.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో రెపిచేజ్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌తో పాటు మరో ఇద్దరు రెజ్లర్లను మట్టికరిపించి పతకాన్ని చేజిక్కించుకుంది. చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం సాధించిన భారత ఐదో మహిళా కుస్తీరాణిగా నిలిచింది. టోక్యో(2022) ఒలింపిక్స్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకున్న తొలి మహిళా రెజ్లర్‌ ఫోగటే. మరోవైపు సెమీస్‌లో ఓడిన పూజ రెపిచేజ్‌లో కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. నూర్‌-సుల్తాన్‌(కజకిస్థాన్‌) : ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌(53కేజీలు) అద్భుత ప్రదర్శన చేసింది. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణాలతో సత్తా చాటినా గత మూడేళ్లుగా చాంపియన్‌షిప్‌లో మాత్రం రిక్తహస్తాలతో వెనుదిరిగిన ఫోగట్‌.. ఈసారి అదిరే పోరాటంతో కాంస్యాన్ని పట్టేసింది. రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ముకైదా చేతిలో ఓటమి ఎదురైనా.. రెపిచేజ్‌ రౌండ్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ హెల్దెబ్రాండ్‌తో పాటు మరో ఇద్దరిని చిత్తుచేసి సత్తా చాటింది. టోక్యో (2020) ఒలింపిక్స్‌లో 53కేజీల vinesh-phogat1 ఫ్రీైస్టెల్‌లో బెర్త్‌ను పక్కా చేసుకుంది. బుధవారమిక్కడ జరిగిన రెపిచేజ్‌ పోటీల్లో వరుసగా వినేశ్‌ 5-0తో యులియా ఖవాడ్జీ బలహిన్యా(ఉక్రెయిన్‌)ను, ప్రపంచ నంబర్‌ వన్‌ రెజ్లర్‌ సారా అన్‌ హెల్దెబ్రాండ్‌(అమెరికా)ను 8-2తో, మారియా ప్రెవోలారకీ(గ్రీకు)ను 4-1తో చిత్తు చేసింది. రెండు విజయాల తర్వాతే విశ్వక్రీడల్లో చోటు పక్కా చేసుకున్న ఫోగట్‌.. చివరిదైన కాంస్యపోరులో మారియాను కట్టడి చేయగలిగింది. ప్రత్యర్థి అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఉత్కంఠ పోరులో డిఫెన్స్‌ను ఛేదించి విజయం సాధించింది. vinesh-phogat2

కాంస్యపోరులో పూజ

గత చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో సత్తా చాటిన భారత స్టార్‌ రెజ్లర్‌ పూజ దండా(59 కేజీలు) బుధవారం జరిగిన సెమీఫైనల్లో 0-10తో టెక్నికల్‌ సుపీరియాటితో లిబోవ్‌ ఒచారోవా(రష్యా) చేతిలో ఓటమి చెందింది. అయితే రెపిచేజ్‌ రౌండ్‌లో గెలిస్తే ఆమె కాంస్యాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. గురువారం జరిగే రెపిచేజ్‌ను పూజ విజయంవంతంగా ముగిస్తే చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కుతుంది. అంతకుముందు క్వార్టర్స్‌లో పూజ 11-8తో యుజుక ఇంగాకీ(జపాన్‌)ను చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. సీమా బిస్లా(50కేజీలు), నవ్‌జోత్‌ కౌర్‌(76కేజీలు) ఓటమి పాలయ్యారు