పిడుగుపడి యువతి మృతి..

యువతి ఫైల్ ఫోటో కొల్లాపూర్: కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పరిధిలోని సింగోటం గ్రామంలో పిడుగు పడి 23 ఏళ్ల యువతి సహా రెండు ఎడ్లు మరణించాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో ఉరుములు, మెరుపులతో జోరుగా వాన కురుస్తోంది. జోరుగా కురుస్తున్న వానలకు పిడుగు పడడంతో యువతి అక్కడిక్కడే మరణించగా.. కొట్టంలో కట్టేసి ఉన్న రెండు ఎద్దులు సైతం మరణించాయని వారు తెలిపారు. దీంతో ఊర్లో తీవ్ర విషాదం నెలకొందని గ్రామస్తులు వాపోయారు. యువతి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదని వారు తెలిపారు. యువతిని పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Related Stories:

More