కుటుంబ సమేతంగా ‘సైరా’ సినిమాను తిలకిలంచిన గవర్నర్

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాను ఇవాళ కుటుంబ సమేతంగా కలిసి థియేటర్లో తిలకించారు. ఈ షోకు చిరంజీవి, ఆయన కుమార్తె, సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుశ్మిత కూడా హాజరయ్యారు. ఈ సినిమా గురించి గవర్నర్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుంది. గొప్ప చరిత్రకారుడు, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రను తెలుసుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు. సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు జీవం పోశారని ఆమె అన్నారు. సినిమాలో చిరంజీవి కనిపించలేదనీ, నరసింహా రెడ్డినే చూసినట్లుందన్నారు. మిగితా నటీనటులు సైతం చక్కని నటన కనబరిచారని ఆమె ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె హీరో చిరంజీవి సహా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. మెగాస్టార్ ఈ సందర్భంగా గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
More