మైనర్ బాలిక ప్రసవం.. చిన్నారిని విక్రయించేందుకు యత్నం

బోధన్: బోధన్‌లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మైనర్ బాలిక చిన్నారికి జన్మనిచ్చింది. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా చిన్నారిని విక్రయించేందుకు ఆమె తల్లిదండ్రులు యత్నించారు. వివరాల్లోకెళ్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఫయాజ్ అనే వ్యక్తి సదరు మైనర్ బాలికను గత కొన్ని నెలలుగా శారీరకంగా వాడుకున్నాడు. దీంతో, బాలిక గర్భం దాల్చింది. పురిటి నొప్పులు రావడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా.. ఈ రోజు తెల్లవారు జామున బాలిక నార్మల్ డెలివరీతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక తల్లిదండ్రులు తమ పరువెక్కడ పోతుందోనని ముక్కు పచ్చలారని చిన్నారిని విక్రయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీసీవో లలితా కుమారి, ఆదర్శ యువతి మహిళా మండలి అధ్యక్షురాలు పద్మసింగ్ చిన్నారిని తీసుకొని, స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Related Stories:

More