హన్మకొండలో అవమానవీయ ఘటన..

హన్మకొండ: పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రెండేళ్ల క్రితం కన్నతల్లిని ఓ ప్రబుద్ధుడు ఇంటినుంచి గెంటేశాడు. ఆమె పేరు శ్యామల. ఓ వార్తా పత్రికలో ఈ ఘటనకు సంబంధించిన ప్రచురణ రావడంతో సహృదయ వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆమెను ఆశ్రమంలో చేర్చుకున్నారు. కాగా, అనారోగ్యంతో ఇవాళ ఆమె ఆశ్రమంలో మరణించారు. ఆశ్రమ నిర్వాహకులు తల్లి మరణ వార్త ఆమె కుమారుడికి తెలియజేశారు. కానీ, అతను మాత్రం అంత్యక్రియలకు రాలేనని ఆశ్రమ నిర్వాహకులకు తేల్చి చెప్పాడు. ఆమె కుమారుడికి తల్లి మరణ వార్త తెలిసినా రాకపోవడంతో చలించిపోయిన ఆశ్రమ నిర్వాహకులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక ఘటన యావత్ సమాజం తలదించుకునేలా ఉందని ఆశ్రమ ప్రతినిధులు తెలిపారు. కన్నతల్లిని కడచూపుకు నోచుకోలేని ఆ కుమారుడిపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బ్రతికుండగా ఎలాగూ తల్లిని పోషించలేని కుమారుడు.. ఆమె అంత్యక్రియలకన్నా వచ్చుంటే ఆమె ఆత్మ శాంతించేదేమోనని వారు అభిప్రాయపడ్డారు.

Related Stories:

More