క‌శ్మీర్ అంశాన్ని ప‌రిశీలిస్తున్నా: చైనా అధ్య‌క్షుడు

హైద‌రాబాద్‌: క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. ఆ దేశానికి చెందిన జినావు ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. బీజింగ్‌లో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ను క‌లిసిన త‌ర్వాత జీ జిన్‌పింగ్ క‌శ్మీర్‌పై త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ఇరు దేశాలు శాంతియుతంగానే ప‌రిష్క‌రించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత పాక్‌, భార‌త్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే అవ‌స‌ర‌మైన మేర‌కు పాక్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్లు జిన్‌పింగ్ తెలిపారు. మ‌రోవైపు ఈవారమే చెన్నైకి చైనా అధ్య‌క్షుడు రానున్న విష‌యం తెలిసిందే.

Related Stories:

More