రోహిత్‌ను ఎంజాయ్ చేయ‌నివ్వండి..

హైద‌రాబాద్‌: టాప్ ఆర్డ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడ‌ని, టెస్టుల్లో అత‌నికి మ‌రింత అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్ల భార‌త్ గెలుస్తుంద‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయ‌ప‌డ్డాడు. పుణెలో ఇవాళ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. సౌతాఫ్రికాతో రెండ‌వ టెస్టు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో కోహ్లీ కొన్ని కామెంట్స్ చేశాడు. రోహిత్ లాంటి ప్లేయ‌ర్ టాప్ ఆర్డ‌ర్‌లో ఆడితే.. టెస్టు మ్యాచ్‌ల‌ను ఈజీగా గెలిచేస్తామ‌ని కోహ్లీ అన్నాడు. టెస్టుల్లో రోహిత్ రాణించ‌డం సంతోష‌క‌ర విష‌య‌మ‌న్నాడు. రెడ్‌బాల్ క్రికెట్‌ను రోహిత్ ఎంజాయ్ చేయ‌నివ్వాల‌న్నాడు. స‌ఫారీల‌తో వైజాగ్‌లో జ‌రిగిన తొలి టెస్టులో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీలు చేశాడు. ఆ మ్యాచ్‌లో భార‌త్ 203 ర‌న్స్ తేడాతో నెగ్గింది. ఇక రెండ‌వ టెస్టు .. కెప్టెన్‌గా కోహ్లీకి 50వ మ్యాచ్ కానున్న‌ది.

Related Stories:

More