బెయిల్ ఇవ్వొద్దు.. జైలుకు పంపండి

హైద‌రాబాద్‌: పీఎంసీ బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు ఇవాళ ముంబై వీధుల్లో ఆందోళ‌న చేప‌ట్టారు. రిజ‌ర్వ్ బ్యాంక్ అల‌స‌త్వాన్ని ప్ర‌శ్నించారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆర్బీఐ స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని క‌స్ట‌మ‌ర్లు ఆరోపిస్తున్నారు. ముంబైలోని ఎస్‌ప్ల‌నేడ్ కోర్టు ముందు భారీ ప్ల‌కార్డుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ‌వారికి బెయిల్ ఇవ్వ‌కూడ‌ద‌ని, వారిని జైలుకు పంపాల‌ని డిమాండ్ చేశారు. ఆవేశానికి లోనైన కొంద‌రు క‌స్ట‌మ‌ర్లు కోర్టు ప్రాంగ‌ణంలో వాహ‌నాల‌పై దాడికి దిగారు. విత్‌డ్రాల‌పై ఆర్బీఐ ఆంక్ష‌లు పెట్ట‌డాన్ని పీఎంసీ బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. తాము ఆదా చేసుకున్న డ‌బ్బును త‌క్ష‌ణ‌మే రిలీజ్ చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. పీఎంసీ బ్యాంకు డైర‌క్ట‌ర్ల‌ను ఇటీవ‌ల ఈడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. పీఎంసీ బ్యాంకులో సుమారు 4వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింది. ఈ కేసులో రాకేశ్ వ‌ద్వానా, ఆయ‌న కుమారుడు సారంగ్ వ‌ద్వానాల‌ను అరెస్టు చేశారు.

Related Stories:

More