శ‌స్త్ర‌పూజ ఓ నాట‌కం

హైద‌రాబాద్‌: ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. ఫ్రాన్స్‌లో ర‌ఫేల్ యుద్ధ విమానాల‌కు శ‌స్త్ర‌పూజ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. శ‌స్త్ర‌పూజ ఓ త‌మాషా అంటూ మాజీ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే విమ‌ర్శించారు. రాజ్‌నాథ్ సింగ్ నాట‌కం ఆడార‌ని ఖ‌ర్గే ఆరోపించారు. గ‌తంలో త‌మ ప్ర‌భుత్వం బోఫోర్స్ లాంటి భారీ గ‌న్నుల‌ను కొనుగోలు చేసింద‌ని, కానీ ఎవ‌రూ ఆ దేశానికి వెళ్లి, పూజ‌లు చేసి ఆయుధాలు తీసుకురాలేద‌న్నారు. ఆయుధాలు స‌రిగా ఉన్నాయా లేదా అన్న విష‌యాన్ని వాయుసేన అధికారులు నిర్ణ‌యిస్తార‌ని ఖ‌ర్గే అన్నారు. కానీ బీజేపీ నేత‌లు మాత్రం ఆయుధాల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నార‌న్నారు. యుద్ధ విమానాల‌ను న‌డుపుతూ హంగామా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ర‌ఫేల్ విమానాల‌కు శ‌స్త్ర‌పూజ చేయ‌డాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా స‌మ‌ర్థించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది న‌చ్చ‌డం లేద‌ని షా అన్నారు. విజ‌య‌ద‌శ‌మి రోజున ఆయుధాల‌కు శ‌స్త్ర‌పూజ చేయ‌రా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దేన్ని విమ‌ర్శించాలి, దేన్ని విమ‌ర్శించ కూడద‌న్న ఆలోచ‌న ఆ పార్టీకి ఉండాల‌ని షా అన్నారు.

Related Stories:

More