రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యలయంలో కొత్త పోస్టులు

హైదరాబాద్: రాష్ట్ర ప్రధానాధికారి కార్యాలయంలో 16 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. ఒక అదనపు సీఈవో, ఒక సంయుక్త సీఈవో, ఒక అసిస్టెంట్ సెక్రటరీ, మూడు ఏఎస్‌వో సహా ఇతర పది పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోస్టులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
More in తాజా వార్తలు :