90 వసంతాల న్యూఢిల్లీ

-చారిత్రక నగరానికి 1926 డిసెంబర్ 31న నామకరణం న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశ రాజధానికి న్యూఢిల్లీ అని నామకరణం చేసి 90 ఏండ్లు అయింది. 1911 డిసెంబర్ 12 కొత్త నగరం ఏర్పాటైంది. అప్పట్లో ఆ నగరాన్ని న్యూ సిటీ, ఇంపీరియల్ సిటీ, న్యూ ఇంపీరియల్ సిటీ, న్యూ క్యాపిటల్, న్యూ ఇంపీరియల్ క్యాపిటల్ అనే పేరుతో పిలిచేవారు. ఎన్నో పేర్లతో పిలుస్తు వచ్చిన నగరానికి 1926 డిసెంబర్ 31న కింగ్ జార్జ్ V న్యూఢిల్లీ అని నామకరణం చేశారని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా రికార్డులు వెల్లడిస్తున్నాయి. కొత్త రాజధానికి న్యూఢిల్లీ అని నామకరణం చేస్తూ కింగ్ జార్జ్ ఆమోదించారనే సమాచారాన్ని తెలియజేస్తున్నాం అని అప్పటి హోంశాఖ విభాగం జారీచేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంపీరియల్ క్యాపిటల్‌ను కలకత్తా నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్టు 1911 డిసెంబర్ 12న కోరోనేషన్ పార్క్‌లో ప్రకటన చేశారు. చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిన కోరోనేషన్ పార్క్‌ను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఏర్పాటై 2011 సంవత్సారానికి వందేండ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి షీలాదీక్షిత్ ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది.
× RELATED వంతెన పైనుంచి మహానదిలో పడ్డ బస్సు