పంట ఉత్పత్తుల సేకరణకు కొత్త విధానం

న్యూఢిల్లీ: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.15,053 కోట్లతో పంట ఉత్పత్తుల సేకరణ విధానాన్ని ప్రకటించింది. రైతులకు పరిహారం చెల్లించేందుకు ఒక పథకాన్ని ఎంపిక చేసుకోవడంతోపాటు ధాన్యం సేకరణలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించే అవకాశాన్ని రాష్ర్టాలకు కల్పించింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా దిగువకు నూనె గింజల రేట్లు పడిపోయినప్పుడు రైతులకు పరిహారం చెల్లించే కొత్త విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎస్పీకి దిగువకు పంట ఉత్పత్తుల రేట్లు పడిపోయినప్పుడు రైతులకు పరిహారం చెల్లించేందుకు అమలు చేస్తున్న పలు పథకాలలో ఒకదానిని ఎంపిక చేసుకొనే అవకాశం రాష్ర్టాలకు కల్పించారు. అలాగే ధాన్యం సేకరణలో ప్రైవేటు సంస్థలను అనుమతించనున్నారు. కొత్త విధానం ప్రధానమంత్రి అన్నదాత సంరక్షణ్ అభియాన (పీఎం-ఆశ)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
× RELATED వినాయక నిమజ్జనంపై నాయిని ఏరియల్ సర్వే