కొత్తగా 55 సీవరేజీ ప్లాంట్లు

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్తగా 55 ప్రాంతాల్లో సీవరేజీ ప్లాంట్లను నిర్మించనున్నారు. ఈ మేరకు షా టెక్నికల్ కన్సల్టెన్సీ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను జలమండలి ఎండీ దానకిశోర్‌కు అందజేసింది. 1451 స్కేర్ కిలోమీటర్ల మేర సేవల పరిధిని 10 క్యాచ్‌మెంట్ ఏరియాలుగా విభజించారు. చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాంతాల వారీగా ఉత్పత్తి అయ్యే మురుగునీటి దృష్ట్యా ఎస్టీపీ కేంద్రం ఎంత సామర్థ్యంతో ఎక్కడ నిర్మించాలి? ఇందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం వివరాలను పేర్కొంటూ నివేదిక అందజేశారు. ఈ మేరకు 55 ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

Related Stories: