సైకలాజికల్ థ్రిల్లర్

హర్షిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నేను లేను. లాస్ట్ ఇన్ లవ్ అని ఉపశీర్షిక. దొంతు రమేష్ దర్శకుడు. ఓయస్‌ఎం విజన్, దివ్యాంక క్రియేషన్స్ పతాకంపై సుక్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటి వరకు ఎవరూ చూడని కొత్త పంథాలో సినిమా వుంటుంది. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తాం అన్నారు. శ్రీపద్మ, వంశీకృష్ణ పాండ్య, మాధవి, బిశ్వజిత్‌నాథ్, రుద్రప్రకాష్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్నారు.