విజ‌య్ మాల్యా అప్ప‌గింత‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

లండ‌న్: బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసిన విజ‌య్ మాల్యాను భార‌త్‌కు అప్ప‌గించాల‌ని ఇవాళ లండ‌న్ కోర్టు తీర్పునిచ్చింది. భార‌తీయ స్టేట్ బ్యాంక్‌తో సంబంధం ఉన్న బ్యాంకుల‌కు మాల్యా సుమారు 9 వేల కోట్లు ఎగొట్టారు. వెస్ట్‌మినిస్ట‌ర్ కోర్టు ఈ కేసులో ఇవాళ కీల‌క తీర్పును వెలువ‌రించింది. మాల్యా కేసు విదేశాంగ శాఖ చూసుకుంటుంద‌ని కోర్టు వెల్ల‌డించింది. అయితే బ్యాంకుల‌కు చెల్లించాల్సిన సొమ్మును ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు మాల్యా ఇటీవ‌ల ఓ ట్వీట్‌లో వెల్ల‌డించారు. అదే విష‌యాన్ని ఇవాళ కోర్టుకు వెళ్లేముందుకు కూడా మాల్యా స్ప‌ష్టం చేశారు. కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల‌కు కూడా జీతాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మాల్యా చెప్పారు. బ్యాంకుల‌కు కుచ్చుటోపీ పెట్టిన మాల్యా.. 2016లో బ్రిట‌న్‌కు ప‌రార‌య్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న లండ‌న్‌లోని ఓ భ‌వంతిలో నివాసం ఉంటున్నారు. వెస్ట్‌మినిస్ట‌ర్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ స్వాగ‌తించింది. ఇక త్వ‌ర‌లోనే మాల్యాను భార‌త్‌కు తీసుకువ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఆయ‌న కోసం ముంబైలో ప్ర‌త్యేక జైలును కూడా త‌యారు చేశారు. కోర్టు తీర్పుపై అపీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల స‌మ‌యాన్నిచ్చారు.

Related Stories: