ఆధిపత్య పోరులో..

అరవిందస్వామి, శింబు, జ్యోతిక, అదితిరావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నవాబ్. మణిరత్నం దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ సంస్థ రూపొందిస్తున్నది. తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27న విడుదల చేయబోతున్నారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ యాక్షన్, కుటుంబ భావోద్వేగాల సమాహారంగా సాగే చిత్రమిది. వారసత్వం, అధిపత్యం కోసం ఓ కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరిగే డ్రామా ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. అరవిందస్వామి పాత్ర చిత్రణ వినూత్నంగా ఉంటుంది. ఏ.ఆర్.రహమాన్ సంగీతం, సంతోష్‌శివన్ ఛాయాగ్రహణం ప్రత్యేకార్షణగా నిలుస్తాయి. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది అన్నారు. అరుణ్‌విజయ్, ఐశ్వర్యరాజేష్, విజయ్ సేతుపతి, ప్రకాష్‌రాజ్, త్యాగరాజన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, మాటలు: కిరణ్, ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్టరాయ్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, నిర్మాతలు: మణిరత్నం, సుభాష్‌కరణ్, దర్శకత్వం: మణిరత్నం.