రేప్ కేసులో మిస్టర్ ఇండియా అరెస్టు

కొట్టాయం: కేరళలో ఓ మహిళను రేప్ చేసిన కేసులో 38 ఏళ్ల నేవీ ఆఫీసర్‌ను అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటాని తన కూతుర్ని నేవీ ఆఫీసర్ మోసం చేశాడని ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలో చీఫ్ పెట్టీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మురళీ కుమార్‌ను పోలీసులు జ్యుడిషయల్ కస్టడీలోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు కింద అతన్ని బుక్ చేశారు. మురళీ కుమార్ గతంలో రెండు సార్లు మిస్టర్ ఆసియా టైటిల్‌ను గెలిచాడు. మిస్టర్ ఇండియా టైటిల్‌ను కూడా అతను 8 సార్లు గెలవడం విశేషం. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్న‌ మిస్టర్ ఇండియా మురళీ.. ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు. నేవీ అధికారుల ఎదుట కేసు గురించి వివరించనున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు